ఛారిటీ సొమ్ము ఎన్నికలకు వాడతారా: ట్రంప్‌పై కోర్టు ఆగ్రహం.. 2 మిలియన్ డాలర్లు ఫైన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చర్యలకు అక్కడి న్యాయవ్యవస్థ వరుస షాక్‌లిస్తోంది.ఇప్పటి ట్రంప్ తీసుకున్న పలు వివాదాస్పద నిర్ణయాలకు కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలిన సంగతి తెలిసిందే.

 Newyork State Judgefinestrump For Miss Using Charity Money-TeluguStop.com

తాజాగా ఎన్నికల ఖర్చు కోసం విరాళాలను యధేచ్చగా వాడేశారంటూ ట్రంప్‌కు 2 మిలియన్ డాలర్లు జరిమానా విధించింది న్యూయార్క్ కోర్టు.

ట్రంప్ ‘‘ట్రంఫ్ ఫౌండేషన్ ’’ పేరిట ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సేవా సంస్థకు ఉన్న గుర్తింపు దృష్ట్యా పలువురు దాతలు భారీగా విరాళాలు అందజేసేవారు.అయితే 2016 అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ అవసరాల కోసం ట్రంప్.తన ఫౌండేషన్ నిధులను వాడుకున్నారని న్యూయార్క్ అటార్నీ జనరల్ జేమ్స్ న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సాలియన్ స్కార్పుల్లా.

ఈ అభియోగాలను నిర్థారించిన జడ్జి మొత్తం 8 ఎన్‌జీవోలకు ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు వెలువరించారు.

Telugu American, Telugu Nri Ups, Trump-

దీనిపై కొద్దినిమిషాల్లో స్పందించిన డొనాల్డ్ ట్రంప్… అటార్నీ జనరల్‌పై మండిపడ్డారు.అటార్నీ జనరల్ కావాలనే తీర్పును తప్పుదోవ పట్టిస్తున్నారని.ట్రంప్ ఫౌండేషన్ చేసిన కొన్ని చిన్న సాంకేతిక ఉల్లంఘనల నేపథ్యంలో కోర్టుతో ఓ ఒప్పందం కుదిరిందని ఆయన వ్యాఖ్యానించారు.

దీనిని అటార్నీ కావాలనే రాజకీయం చేస్తున్నారని.అయితే కోర్టు ఆదేశాల ప్రకారం స్వచ్ఛంద సంస్థలకు 2 మిలియన్ డాలర్లు ఇవ్వడం సంతోషంగా ఉందని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

కోర్టు తీర్పు అనంతరం న్యూయార్క్ అటార్నీ జనరల్ జేమ్స్ స్పందిస్తూ.ఛారిటీ కింద దాతలు ఇచ్చిన నిధులు పక్కదారి పట్టకుండా తాము చేసిన పోరాటం ఫలించిందన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube