న్యూయార్క్ మేయర్ సంచలన నిర్ణయం..!!!

అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి ఏ రేంజ్ లో ప్రభావం చూపుతోంది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది అమెరికా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

 Corona Virus, Lock Down, America, Donald Trump, World Health Organization, New Y-TeluguStop.com

ముఖ్యంగా అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్ నగరం కోలుకోలేని పరిస్థితులో ఉంది.ఆర్ధిక ప్రాణ నష్టం అమెరికాలో న్యూయార్క్ ప్రాంతానికే ఎక్కువగా జరిగింది.

ఈ క్రమంలోనే న్యూయార్క్ సిటీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

ట్రంప్ లాక్ డౌన్ ఎత్తివేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నా న్యూయార్ గవర్నర్ ఆండ్రూ మొదటి నుంచీ ట్రంప్ చర్యలకి అడ్డుపడుతూనే ఉన్నారు తమ ప్రజల ప్రాణాలే ముఖ్యమని తెలిపిన గవర్నర్ అందుకు ప్రజలు ఎవరూ బయటకి రావద్దని కరోనాని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ తరుణంలో న్యూయార్క్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.న్యూయార్క్ మేయర్ బ్లాసియో మాట్లాడుతూ

న్యూయార్క్ లో లాక్ డౌన్ జూన్ వరకూ అమలు చేస్తున్నామని ప్రకటించారు.

ఇదిలాఉంటే ఇప్పటికే పలు రాష్ట్రాలలో ట్రంప్ సూచలన మేరకు లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు.కొందరు దశల వారీగా లాడ్ డౌన్ తీసేస్తుంటే మరికొందరు ఒకే సారి లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు దాంతో ఈ పరిణామాలు మరింత దారుణానికి కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఈ తరుణంలో న్యూయార్క్ ప్రభుత్వం మాత్రం జూన్ వరకూ లాక్ డౌన్ పొడిగించడం సంచలనం సృష్టిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube