ఇది విన్నారా : జూమ్‌ యాప్‌లో పెళ్లి, దానికి చట్టబద్దత కూడానట

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో అంతే స్పీడ్‌గా ప్రపంచ వ్యాప్తంగా జూమ్‌ యాప్‌ను కూడా వినియోగదారులు వినియోగిస్తున్నారు.మొన్నటి వరకు ఉన్న డౌన్‌లోడ్స్‌తో పోల్చితే ఈమద్య కాలంలో ఏకంగా మూడు వందల రెట్ల ఎక్కువ డౌన్‌లోడ్స్‌ అయ్యాయి.

 America, China, Corona Virus, Zoom App, Office Work, Marriages, New York, Govern-TeluguStop.com

ప్రపంచంలో అన్ని రంగాలు కూడా కుదేలవుతున్న ఈ సమయంలో జూమ్‌ యాప్‌ నిర్వాహకుల ఆదాయం వేల కోట్ల రూపాయలు పెరిగింది.చైనాకు చెందిన జూమ్‌ యాప్‌ను దాదాపు అన్ని దేశాలు కూడా వాడుతున్నాయి.

క్లౌడ్‌ మీటింగ్‌ యాప్‌ అయిన దీన్ని ఆఫీస్‌లు విద్యాసంస్థలు ప్రముఖంగా వాడుతున్నాయి.

ప్రస్తుతం జూమ్‌ యాప్‌లో క్లాస్‌లు చెప్పడంతో పాటు ఆఫీస్‌ పనులు కూడా చక్క బెట్టుకుంటున్నారు.

దాంతో పాటు ఇప్పుడు కొత్తగా పెళ్లిలకు కూడా పర్మీషన్‌ ఇస్తున్నారు.స్వయంగా అమెరికన్‌ ప్రభుత్వం జూమ్‌ యాప్‌లో పెళ్లికి చట్టబద్దత కల్పిస్తున్నట్లుగా ప్రకటించింది.

తాజాగా న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పెళ్లిలు అన్ని ఆగిపోయాయి.

కనుక పెళ్లిలు చేసుకునేందుకు రోజుకు అమెరికా ప్రభుత్వం వద్దకు లక్షల కొద్ది అప్లికేషన్స్‌ వస్తున్నాయట.

Telugu America, Andrew Cuomo, China, Corona, Governor, Marriages, York, Zoom App

పెళ్లిలకు అనుమతులు ఇవ్వడం లేదు.అక్కడ రూల్‌ ప్రకారం ప్రభుత్వం అనుమతిస్తేనే పెళ్లి చేసుకోవాలి.అప్పుడే రిజిస్ట్రర్‌ అవుతుంది.

ప్రభుత్వం అనుమతి లేకుండా పెళ్లిలు చేసుకుంటే అసలు వారు భార్య భర్తలుగా అయినట్లుగా గుర్తించరు.ఇప్పుడు జూమ్‌ యాప్‌లో వివాహం చేసుకుని రిజిస్ట్రేషన్‌కు దరకాస్తు పెట్టుకున్న వారి పెళ్లిలను రిజిస్ట్రర్‌ చేయించేందుకు న్యూయార్క్‌ గవర్నర్‌ ఓకే చెప్నారు.

పెళ్లి సమయంలో జూమ్‌ యాప్‌లో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అధికారి ఉండాల్సి ఉంటుంది.ఆయన చూస్తుండగా పెళ్లి చేసుకుంటే ఆయన పెళ్లికి సాక్ష్యంగా వ్యవహరించి పెళ్లి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ ఇస్తారట.

ఇదేదో బాగుంది కదా.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube