ఇకపై న్యూయార్క్ లో వ్యాక్సిన్ పాస్ పోర్ట్...గగ్గోలు పెడుతున్న వ్యాపారులు..!!

అమెరికాలో డెల్టా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం మళ్ళీ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ లో ఉండాలని ప్రజలకు సూచనలు చేస్తోంది.అధ్యక్షుడు బిడెన్ సైతం కొంత కాలం ఈ నిభందనలు తప్పవని అమెరికన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిభందనలు అమలు చేస్తున్నామని ప్రకటించారు.

 Newyork Covid Vaccine Passport Mandatory For Business People, Newyork Covid Vacc-TeluguStop.com

అలాగే అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సైతం డెల్టా వేరియంట్ విషయంలో రెండు వ్యాక్సిన్ లు తీసుకున్న వాళ్ళు సైతం ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.ఈ నేపధ్యంలో అమెరికాకు అత్యంత కీలక రాష్ట్రమైన న్యూయార్క్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు


న్యూయార్క్ మేయర్ బ్లాసియో ఇకపై న్యూయార్క్ లో ఉండే వారికి వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఉండాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు.ఈ కొత్త నిభందన ఆగస్టు 16 నుంచీ అమలులోకి వస్తుందని బ్లాసియో తెలిపారు.

పూర్తి స్థాయిలో ఈ నిభందన సెప్టెంబర్ 13 నుంచీ అమలవుతుందని తెలిపారు.వ్యాక్సిన్ పాస్పోర్ట్ విషయంలో పూర్తి మార్గదర్సకాలు సిద్దం చేస్తున్నామని న్యూయార్క్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు.ఇదిలాఉంటే

Telugu America, Covid Vaccine, Delta, Newyork, Newyorkcovid-Telugu NRI

న్యూయార్క్ లో హోటల్ కి వెళ్ళినా, జిమ్, రెస్టారెంట్, పార్క్, ప్రదర్సనలు, ఉద్యోగులు, ఇలా ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వారి వద్ద ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ ఉండి తీరాల్సిందేనని, కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అయినా తీసుకున్నట్టుగా అందులో ఉండాలని సూచించారు.ప్రస్తుతం అమెరికాలో డెల్టా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని, మొదటి వేవ్ లో న్యూయార్క్ చవి చూసిన ఘటనలు మళ్ళీ పునరావృతం అవకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ వేగవంతం అవ్వాలని అందుకే ఈ వ్యాక్సిన్ పాస్ పోర్ట్ అమలు చేస్తున్నామని, ప్రజలు ఈ నిభందన తప్పనిసరిగా అనుసరించాలని సూచించారు.అయితే బ్లాసియో తీసుకున్న నిర్ణయానికి స్థానికంగా ఉన్న హోటల్స్, రెస్టారెంట్ లు నుంచీ నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube