కొత్త వాహన చట్టం : పోలీసులతో వాగ్వివాదం చేస్తూ టెక్కీ మృతి

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వాహన చట్టం ప్రస్తుతం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే.కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ నిబంధనల కారణంగా సామాన్యులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు అంటూ ప్రతి రోజు మనం సోషల్‌ మీడియాలో చూస్తున్నాం.15 వేల బైక్‌కు పాతిక వేల ఫైర్‌ రావడం, కారులో ఉన్న వ్యక్తి హెల్మెట్‌ పెట్టుకోలేదని ఫైర్‌ వేయడం, ఆటోకు 50 వేల ఫైన్‌ ఇలా పలు విషయాలను గురించి మనం ప్రతి రోజు వార్తలు చూస్తున్నాం.కాని ఈసారి కొత్త చట్టం కారణంగా ఒక మనిషి ప్రాణాలు పోయాయి.

 Newtrafficrule One Of Thesoftweare Employedead 1-TeluguStop.com

నోయిడాకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు.ఆ సమయంలో రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు ఆ కారును ఆపారు.

లాఠీతో కారుపై కొడుతూ కొత్త వాహన చట్టం ప్రకారం మీ కారును తనిఖీ చేయాలి, అలాగే మీ వద్ద ఉన్న డాక్యుమెంట్స్‌ను చూపించండి అంటూ కోరడం జరిగింది.తన వద్ద డాక్యుమెంట్లు చూడాలంటే కారుపై లాఠీతో కొట్టడం ఎందుకు అంటూ టెక్కీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులకు అతడికి మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది.ఆ సమయంలోనే టెక్కీ గుండెపోటు వచ్చి మృతి చెందాడు.ఈ విషయమై పోలీసు వారిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube