న్యూస్ రౌండప్ -  టాప్ 20 

1.గ్రేటర్ నోటిఫికేషన్ విడుదల


 Telugu Top Ten News , Ghmc, Tirupathi Bypolls, Kcr, Ktr, Corona Virus Status, Co-TeluguStop.com

Telugu Corona Status, Covid Ups, Ghmc, Jaisingh, Kidnap Ap, Telugu Top, Tirupath

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.డిసెంబర్ ఒకటో తేదీన ఎన్నికల పోలింగ్ , నాలుగో తేదీన కౌంటింగ్.ఈసారి మేయర్ పదవి జనరల్ కేటగిరిలో మహిళలకు దక్కే అవకాశం.

2.కరోనా బులిటెన్


Telugu Corona Status, Covid Ups, Ghmc, Jaisingh, Kidnap Ap, Telugu Top, Tirupath

గడచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనా పాజిటివ్ ప్రభావానికి గురైన వారి సంఖ్య 952 గా నమోదవగా, ముగ్గురు ఈ వైరస్ ప్రభావానికి గురై మరణించినట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

3.తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు


Telugu Corona Status, Covid Ups, Ghmc, Jaisingh, Kidnap Ap, Telugu Top, Tirupath

త్వరలోనే తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ని  తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.ఇక్కడ నుంచి పనబాక లక్ష్మి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.ఆమెకు మరోసారి ఇక్కడ అవకాశం కల్పించారు.

4.అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు


Telugu Corona Status, Covid Ups, Ghmc, Jaisingh, Kidnap Ap, Telugu Top, Tirupath

ఒక్కో చోట ఒక్కో విధంగా, తండ్రి పేరును మార్చే పిల్లలను నేనెక్కడా చూడలేదు అంటూ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత  గజపతి రాజు పై మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

5.కేసీఆర్ కు శుభవార్త చెప్పిన ఎన్నికల సంఘం


Telugu Corona Status, Covid Ups, Ghmc, Jaisingh, Kidnap Ap, Telugu Top, Tirupath

 గ్రేటర్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని నిబంధనల మేరకు అందించేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది అయితే నేరుగా సొమ్ములు ఇవ్వకుండా బ్యాంకు ఖాతాలో జమ చేయాలంటూ సూచించింది.

6.ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కేసు నమోదు


Telugu Corona Status, Covid Ups, Ghmc, Jaisingh, Kidnap Ap, Telugu Top, Tirupath

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పై అనంతపురం లో కేసు నమోదైంది.నంద్యాల ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సోము వీర్రాజు మత రాజకీయాలకు పాల్పడుతూ మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అంటూ ఆయనపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగరాజు అనే వ్యక్తి  ఫిర్యాదు చేశారు.

7.వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ప్రారంభం


సున్నా వడ్డీ కింద రైతులకు పంట రుణాలు ఇచ్చే పథకాన్ని జగన్ ఈరోజు వర్చువల్ గా ప్రారంభించారు.పంట రుణాల పై రైతులకు ఇప్పటికీ వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లి ఇస్తున్నామని జగన్ ప్రకటించారు.ఇప్పటికే 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

8.దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాలు


దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం ఇంకా తగినట్టుగా కనిపించడం లేదు.

గడచిన 24 గంటల్లో కొత్తగా 29, 163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.మొత్తం దేశ వ్యాప్తంగా కరుణ కేసుల సంఖ్య 88, 74,290 కాగా, ప్రస్తుతం 4,53,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

9.రఘునందన్ రావు పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం


దుబ్బాక ఉప ఎన్నికలకు ముందు బిజెపి అభ్యర్థి గా ఉన్న రఘునందన్ రావు పై అత్యాచార ఆరోపణలు చేసిన బాధిత మహిళ రమణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ మేరకు ఆమె నిద్రమాత్రలు మింగి నట్టుగా పోలీసులు వెల్లడించారు.కాఫీ లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడని రమణి రఘునందన్ రావు పై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

10.బిజెపిలో చేరిన టిఆర్ఎస్ సీనియర్ నేత


తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీకి  వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి.

తాజాగా టిఆర్ఎస్ కు చెందిన అల్లాపూర్ డివిజన్ సీనియర్ డివిజన్ నాయకుడు పులి గోళ్ళ శ్రీనివాస్ యాదవ్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అధ్వర్యంలో చేరిపోయారు.ఆయనతో పాటు మాజీ కౌన్సిలర్ లు మరికొంతమంది బీజేపీలో చేరారు.

11.ఇండియా పై ఒబామా సంచలన వ్యాఖ్యలు


భారత దేశపు హిందూ పురాణ మహాకావ్యాలు అంటే తనకు ఎంతో మక్కువ అని గుర్తు చేసుకున్నారు, అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా.ఈ సందర్భంగా ఇండియా తో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

12.గ్రేటర్ ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ పై సంచలన వ్యాఖ్యలు


జిహెచ్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ ఆపాలంటూ ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కొద్ది రోజుల క్రితం హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా జిహెచ్ఎంసి లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని శ్రావణ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.దీనిపై స్పందించిన కోర్టు ఎప్పుడో పదేళ్ళ క్రితం సుప్రీం కోర్టులో తీర్పు వస్తే, ఇప్పటి వరకు ఏం చేశారు అంటూ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

13.రైతుల ఖాతాల్లో కేంద్రం వేస్తున్న సొమ్ములు జమ కాలేదా ? ఇలా చేయండి

Telugu Corona Status, Covid Ups, Ghmc, Jaisingh, Kidnap Ap, Telugu Top, Tirupath

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం పేరుతో కేంద్రం అర్హత ఉన్న రైతులకు మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు వేల రూపాయల సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది.ఈ సొమ్ములు అందనివారు సమీపంలోని వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసి సొమ్ములు పొందవచ్చు.అలాగే 18001155266 టోల్ ఫ్రీ నెంబర్, 155261 హెల్ప్ లైన్ నంబర్ , 011 23381092, 23382401, ల్యాండ్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి అర్హత ఉన్నవారు అమ్ములు పొందవచ్చు అని కేంద్రం ప్రకటించింది.

14.ఏపీ లో కిడ్నాప్ కలకలం


ఏపీ లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి నిర్మలా నగర్ లో బాలుడు కిడ్నాప్ అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.నిర్మల నగర్ కు చెందిన వినయ్ (12) అని బాల్ రాత్రి 8 గంటల సమయంలో కిడ్నాప్ అయ్యారని, పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారని, 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

15.పూజల పేరుతో ఇచ్చిన జీవోను కొట్టేసిన హై కోర్ట్


స్వరూపానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో నిర్వహించాలంటూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.శ్రీకాకుళం అరసవిల్లి నుంచి చిత్తూరు కాళహస్తి వరకు అన్ని దేవాలయాల్లోనూ పూజలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా, చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దీనిపై హైకోర్టును ఆశ్రయించగా, విచారించిన న్యాయస్థానం ఇరువైపుల ఈ వాదనను విని సదరు మెమో ను కొట్టేస్తూ తీర్పు చెప్పింది.

16.గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి పోటీ  !


ఎట్టకేలకు గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో దించేందుకు తెలంగాణ టిడిపి నిర్ణయించుకుంది.ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ క్లారిటీ ఇచ్చారు .కాకపోతే అన్ని చోట్ల పోటీ చేయబోమని కేవలం తమకు బలం ఉన్న ప్రాంతాల్లో పోటీ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

17.మీసేవ సెంటర్ల వద్ద పెరిగిపోతున్న క్యూ


గ్రేటర్ లో వరద సాయం పంపిణీ చేపట్టడంతో మీసేవ సెంటర్ల వద్ద వరద బాధితులు పెద్ద ఎత్తున క్యూ కట్టేస్తున్నారు.

దీనికితోడు సిబ్బంది కొరత, సర్వర్ ప్రాబ్లం వంటివి ఎక్కువగా ఉండడంతో ఈ క్యూ లు మరింతగా పెరిగి పోతున్నాయి.ఇదే అదునుగా మీసేవ సిబ్బంది 200 వసూలు చేస్తున్నారని వరద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రభుత్వం మాత్రం 45 రూపాయలు మాత్రమే చెల్లించాలని పేర్కొంది.

18.ఫిబ్రవరిలో ఏపీలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ ?


ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు గా కనిపిస్తోంది.ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టు తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.

19.ఢిల్లీలో లాక్ డౌన్ ? కేజ్రీవాల్ ప్రతిపాదన


రోజురోజుకు ప్రమాదకర స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరిగిపోతుండడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఢిల్లీలో లాక్ డౌన్ అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన కేంద్రాన్ని కోరారు.

20.బిజెపికి కేంద్ర మాజీ మంత్రి రాజీనామా


Telugu Corona Status, Covid Ups, Ghmc, Jaisingh, Kidnap Ap, Telugu Top, Tirupath

పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపిస్తూ బిజెపి సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి జై సింగ్ రావు గైక్వాడ్ పాటిల్ బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.తన రాజీనామా లేఖను మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కు అందజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube