తెలంగాణ ఆర్టీసీ కార్మికులు పండగ చేసుకునే వార్త..!!

2019 ఏడాది ప్రారంభంలో సరిగ్గా సంక్రాంతి పండుగ ఏ టైంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు 51 రోజులపాటు సమ్మెకు దిగడం అందరికీ తెలిసిందే.ఆర్టీసీకి సరైన సీజన్ టైం లో ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్ తో సమ్మెకు పిలుపునిచ్చింది అన్ని ఆర్టీసీ డిపో లలో విధులు బహిష్కరించడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇరుకున పడినట్లయింది.

 News That Telangana Rtc Workers Will Celebrate The-festival Tsrtc,kcr,trs,rtc-TeluguStop.com

దీంతో కేసిఆర్ ప్రభుత్వం అప్పట్లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

ఎలాగైనా బస్సులు నడపాలని విధులకు హాజరు కాని వారిని తీసేయాలని మొదటిలో భావించగా తర్వాత వాళ్ళతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవడం జరిగింది.

ఈ క్రమంలో నేరుగా ఆర్టీసీ కార్మికుల తో భేటీ అయిన కేసీఆర్ కి ఆర్టీసీ కార్మికులు తమ బాధలు చెప్పుకుంటూ ప్రధానంగా విధినిర్వహణలో కొన్ని సందర్భాలలో అనవసర వేధింపులకు గురవుతూ ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.ఉద్యోగ భద్రత కల్పించే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కేసీఆర్ కి సూచించడంతో అప్పట్లో ఆయన ఉద్యోగ భద్రత విషయంలో హామీ ఇవ్వడం జరిగింది.

ఇదిలాఉంటే ఎట్టకేలకు ఆ హామీని తాజాగా నెరవేరుస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు అమలు చేయడం జరిగింది.తాజాగా సంబంధిత ఫైలుపై కేసీఆర్ సంతకం చేయడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube