న్యూస్ రౌండప్ – టాప్ 20  

News Roundup Today, Anjan Kumar, GHMC, BJP, NEC Video conference, Mahesh, Kruthi Shetti, Corona Mask, Street Sellers, Prakasham Tiger, unknown disease, News Toundup Telugu - Telugu Anjan Kumar, Bjp, Corona Mask, Ghmc, Kruthi Shetti, Mahesh, Nec Video Conference, Prakasham Tiger, Street Sellers

1.బైడెన్ కంటతడి


TeluguStop.com - News Roundup Today Anjan Kumar Ghmc

ఇటీవలే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడన్ కంటతడి పెట్టడం సంచలనంగా మారింది.ఆరోగ్య సిబ్బంది తో తాజాగా జరిగిన ఓ ఆన్లైన్ సమావేశం సందర్భంగా వారు చెప్పిన వివిధ సమస్యలపై బై డన్ కంటతడి పెట్టారు.

2.నేను బిజెపిలోకి వెళ్ళడం లేదు.


TeluguStop.com - న్యూస్ రౌండప్ – టాప్ 20-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

తాను బిజెపిలో చేరబోతున్న నంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుండడం పై కాంగ్రెస్ కీలక నాయకుడు అంజన్ కుమార్ స్పందించారు.తాను కాంగ్రెస్ ను వదిలి వెళ్ళేది లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

3.ఉగ్రవాదులతో కెసిఆర్ కు సంబంధాలు ‘ బండి ‘ కామెంట్స్


తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం కేసీఆర్ కుల అహంకారని, ఎంఐఎం ఉగ్రవాద సంస్థ అంటూ విమర్శించారు.

4.గ్రేటర్ పొత్తులపై టిఆర్ఎస్ క్లారిటీ


 జిహెచ్ఎంసి ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నామని, ఎం ఐ ఎం తో పొత్తు పెట్టుకునే ఆలోచన తమకు లేదని టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.

5.ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం


హైదరాబాద్ నగరంలోని ఫతే నగర్ అమృతాండలో డ్రైవర్ భీముడు నాయక్ అనే వ్యక్తి భార్య సీత తన ఇద్దరు కూతుళ్లు శిరీష , గౌరీ లతో సహా నిన్న అర్ధరాత్రి అదృశ్యమవడం కలకలం రేపింది.ఈ వ్యవహారంపై బాల నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

6.బిజెపి గెలిస్తే ఇంటికి 25 వేలు


గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిని మేయర్ చేస్తే ప్రతి ఇంటికి 25 వేలు ఇస్తామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.

7.గ్రేటర్ లో జనసేన తో పొత్తు లేదు


జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని జనసేన పార్టీతో ఎటువంటి పొత్తు లేదని గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.

8.ఎస్ ఈ సీ వీడియో కాన్ఫరెన్స్ రద్దు


ఎస్ ఈ సీ  కార్యాలయంలో ఈరోజు కలెక్టర్లు, జడ్పీ సీఈవో ,జిల్లా పంచాయతీ అధికారులతో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించాల్సిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం రద్దయింది .ఈ మేరకు కలెక్టర్లు ,ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతోనే ఇది రద్దయ్యింది.

9.అమెరికా ఆర్మీ రహస్యాలు చైనా చేతికి


అమెరికాకు చెందిన రహస్య టెక్నాలజీని చైనాకు అక్రమంగా అందించాడు అని అభియోగాలు నమోదు అయిన కేసులో చైనాకు చెందిన ఒరేయ్ సన్ అనే నిందితుడికి అమెరికా న్యాయస్థానం 38 నెలల జైలు శిక్ష విధించింది.ఇతడు అమెరికాలోని టక్ సన్ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.

10.ఆ సినిమాపై ప్రశంసలు కురిపించిన మహేష్


నటుడు సూర్య నటించిన ‘ ఆకాశం నీ హద్దురా ‘ సినిమా వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సూర్యాపేట ప్రశంసలు కురిపించారు.సూర్య నటన తో పాటు ఈ సినిమా స్పూర్తిదాయకమైన చిత్రం అంటూ మహేష్ కొనియాడారు.ఈ మేరకు మహేష్ ట్వీట్ చేశారు.

11.అక్షయ్ కుమార్ – 500 కోట్ల పరువు నష్టం దావా


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో తన పేరును ప్రస్తావించినందుకు ఓ యూట్యూబ్ ఛానల్ పై 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.

12.ఉప్పెన హీరోయిన్ కు బంపర్ ఆఫర్


ఈ సినిమా రిలీజ్ కాకుండానే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఉప్పెన సినిమా హీరోయిన్ కృతి శెట్టి కి వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి.ఎప్పటికీ నేచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్ అనే సినిమాకు ఎంపిక కాగా, మలయాళీ సినిమా క ప్పేలా రీమేక్ కు ఆమె ఎంపికయ్యారు.

13.ఆ పుకారుపై టీటీడీ క్లారిటీ


తిరుమల శ్రీవారి దర్శనానికి వృద్ధులు, చిన్న పిల్లలను అనుమతి ఇస్తున్నారని సోషల్ మీడియాలో పుకార్ల పై టీటీడీ స్పందించింది.కరోనా వైరస్ ప్రభావం ఇంకా ఉండడంతో 10 ఏళ్ల లోపు పిల్లలను, 65 ఏళ్ళు దాటిన వారిని స్వామివారి దర్శనానికి అనుమతించడం లేదని క్లారిటీ ఇచ్చింది.

14.మాస్క్ ధరించకపోతే 2 వేలు ఫైన్


దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుండటం తో బహిరంగ ప్రదేశాలలో ఇకపై మాస్క్ ధరించక పోతే 2 వేలు ఫైన్ విదించబోతున్నట్టు  ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.

15.టిఆర్ఎస్ గ్రేటర్ రెండో జాబితా విడుదల


జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను టిఆర్ఎస్ విడుదల చేసింది.మొదటి విడతలో 105 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయగా, రెండో విడతలో 20 మంది జాబితాను ప్రకటించింది మొత్తం 175 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 25 మంది జాబితా ప్రకటించాల్సి ఉంది.

16.వారి ఖాతాలో మరో పది వేలు

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వ్యాపారాలు చేసుకునే వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈనెల 25వ తేదీన ఏపీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ‘ జగనన్న తోడు ‘ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.ఈ స్కీమ్ లో వీధి వ్యాపారులకు ఐడి కార్డులు ఇవ్వడంతోపాటు 10 వేలు వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేయబోతున్నట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించారు.

17.ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్


కార్తీక మాసం ను పురస్కరించుకుని రాష్ట్రంలోని ఐదు పంచారామాలను ( పాలకొల్లు ,భీమవరం ద్రాక్షారామం ,సామర్లకోట, అమరావతి ) సందర్శించుకునే నిమిత్తం 1750 ప్రత్యేక బస్సులను చెప్పబోతున్న ట్లు ఆర్టీసీ ప్రకటించింది.

18.ప్రకాశం జిల్లాలో పులి… నాలుగు ఆవులు మృతి


ప్రకాశం జిల్లాలోని అర్ధవీడు మండలం లో అర్ధరాత్రి సమయంలో అడవిలో మేత కోసం నాలుగు ఆవులు కనిపించకపోవడంతో, పరిసర ప్రాంతాల్లో వెతికిన కాపరులకు పులి దాడిలో మరణించిన ఆవుల కళేబరాలు తెల్లవారుజాము సమయంలో కనిపించాయి.ఈ ఘటనపై అటవీ అధికారులకు సమాచారం అందడంతో వారు పులి జాడను కనిపెట్టేందుకు వెతుకులాట ప్రారంభించారు.

19.బిజెపి గ్రేటర్ అభ్యర్థుల జాబితా విడుదల


జిహెచ్ఎంసి ఎన్నికలలో బిజెపి తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది ఇందులో 21 మందికి చోటు కల్పించారు.మిగతా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

20.విజయనగరం లో వింత వ్యాధి


విజయనగరం మన్యంలో అంతుచిక్కని వ్యాధి కారణంగా గిరిజనుల ప్రాణాలు కోల్పోతున్నారు.శరీరభాగాలు పాడే కాళ్లు శరీరంపై వాపులు వచ్చి ఆకస్మిక మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.ఈ జిల్లాలోని పాచిపెంట మండలం చిల్ల మామిడి గూడానికి చెందిన పలువురు గిరిజనులు ఈ వ్యాధితో మృతి చెందడం కలకలం రేపుతోంది.

#Street Sellers #Kruthi Shetti #GHMC #Corona Mask #Mahesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

News Roundup Today Anjan Kumar Ghmc Related Telugu News,Photos/Pics,Images..