జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో స్టార్ హీరో అంటూ ప్రచారం.. కానీ?

తన సినిమాలతో క్లాస్, మాస్ ప్రేక్షకులను మెప్పించే డైరెక్టర్లలో దర్శకుడు కొరటాల శివ కూడా ఒకరు.భిన్నమైన కథలను ఎంచుకుంటూనే ఆ సినిమాలతో విజయాలను అందుకుంటున్న ఈ డైరెక్టర్ తర్వాత సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కనుంది.

 Hero Rajasekhar In Ntr And Koratala Siva Movie, Ntr, Koratala Siva, Hero Rajasek-TeluguStop.com

కొన్నేళ్ల క్రితం ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కగా ఆ సినిమాలో మోహన్ లాల్ కూడా కీలక పాత్రలో నటించారు.త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీలో బాబాయ్ రోల్ ఉంటుందని సమాచారం.

ఈ పాత్ర కోసం దర్శకుడు కొరటాల శివ హీరో రాజశేఖర్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే రాజశేఖర్ ప్రస్తుతం సోలో హీరోగా బిజీ అవుతున్నారు.ఈ హీరో నటించిన శేఖర్ మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.శేఖర్ సినిమాతో మళ్లీ మార్కెట్ పెరుగుతుందని రాజశేఖర్ నమ్మకంతో ఉన్నారు.

ఇలాంటి సమయంలో రాజశేఖర్ బాబాయ్ రోల్స్ లో నటించడానికి ఓకే చెబుతారా అంటే కష్టమే అని సమాధానం వినిపిస్తోంది.

2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీని ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ రిలీజ్ డేట్ గా ప్రకటించగా సినిమా సెట్స్ పై వెళ్లకపోవడంతో ఆ తేదీకి ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ రిలీజయ్యే ఛాన్స్ అయితే లేదు.కొరటాల శివ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతున్నారని సమాచారం.ఈ సినిమాపై అంచనాలు పెరగగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని ఆర్ఆర్ఆర్ మూవీ ఇంటర్వ్యూలో భాగంగా తారక్ వెల్లడించారు.ఎన్టీఆర్ ఈ సినిమా కొరకు బరువు తగ్గి కొత్త లుక్ లోకి మారారు.

కొరటాల తారక్ కాంబో మూవీ మల్టీస్టారర్ గా తెరకెక్కితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube