సుడిగాలి సుధీర్ గురించి షాకింగ్ ప్రచారం.. ఆ షోకు గుడ్ బై చెప్పాడంటూ?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ కు ఏ స్థాయిలో పేరు వచ్చిందో సుడిగాలి సుధీర్ ద్వారా జబర్దస్త్ షోకు కూడా అదే స్థాయిలో పేరు వచ్చింది.సుడిగాలి సుధీర్ చేసిన కామెడీ షోలు, ఈవెంట్లు దాదాపుగా హిట్ అనే సంగతి తెలిసిందే.

 News Goes Viral About Jabardasth Sudigali Sudheer  , Interesting Facts , Jabarda-TeluguStop.com

రష్మీతో సుధీర్ లవ్ ట్రాక్ ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.సుధీర్ రష్మీ జోడీ కోసమే ఈ షోను చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు.

సుధీర్ రష్మీ మధ్య ఏం లేకపోయినా ఏదో ఉందనేలా చేసే మ్యాజిక్ వాళ్లిద్దరి మధ్య ఉంది.

సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ప్రతి వారం కొత్త తరహా స్కిట్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

వీళ్ల వీడియోలకు యూట్యూబ్ లో సైతం రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుండటం గమనార్హం.సుడిగాలి సుధీర్ పలు సినిమాల్లో హీరోగా కూడా నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.

అయితే సుధీర్ కు సినిమా ఆఫర్లు మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వస్తున్నాయి.

అయితే సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నిర్వాహకులకు భారీ షాక్ ఇచ్చారనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ప్రతి సంవత్సరం మల్లెమాల కమెడియన్ల నుంచి అగ్రిమెంట్లు చేయించుకుంటుంది.అయితే హీరోగా అవకాశాలతో బిజీగా ఉన్న సుధీర్ జబర్దస్త్ షో కోసం పని చేయలేనని చెప్పి అగ్రిమెంట్ కు అంగీకరించలేదని బోగట్టా.

సుధీర్ టీమ్ సభ్యులు కూడా జబర్దస్త్ ను వీడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Telugu Jabardasth Show-Movie

ప్రస్తుతం సుధీర్ హీరోగా ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా మరో సినిమా షూటింగ్ త్వరలో మొదలు కానుందని సమాచారం.అయితే జరుగుతున్న ఈ ప్రచారం గురించి సుధీర్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తలో నిజం ఉందో అబద్ధం ఉందో తేలే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube