ద్విచక్ర వాహదారులకు మరో కొత్త రూల్,వింటే ఆశ్చర్యపోతారు!

ఈ నెల 1 వ తారీఖు నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ నిబంధనలతో వాహనదారులకు కంటి మీద కునుకు కూడా లేకుండా పోతుంది.

 Newrule Forbike Riders 1-TeluguStop.com

ఎప్పుడు దేనికి ఫైన్ అంటారో అన్న విషయం అర్ధంకాక వాహన దారులు పిచ్చెక్కిపోతున్నారు.ఇటీవల ఉత్తర ప్రదేశం లో కారు నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదంటూ 500 రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా టూ వీలర్స్ నడిపే వారు స్లిప్పర్స్ వాడకూడదు అంటూ కొత్త రూల్ వచ్చింది.

Telugu Rule, Rule Bike, India, Peoplesaffraid-

  ఈ కొత్త రూల్ తో ద్విచక్ర వాహనదారులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.ఒకవేళ ఈ రూ ని గనుక అతిక్రమిస్తే మాత్రం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.అయితే ఏముంది లే వెయ్యి రూపాయలే కదా అనుకుంటే పొరపాటే.

మొదటిసారి మాత్రమే ఇలా వెయ్యిరూపాయలు ఫైన్ విధిస్తారు.ఒకవేళ రెండోసారి కూడా అదే కంటిన్యూ అయితే మాత్రం 15 రోజుల జైలు శిక్ష కూడా ఉంటుందట.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ రూల్ ఇప్పటికే ఉన్నా కానీ, కొన్ని ప్రదేశాల్లో మాత్రంఇంకా అమలు చేయలేదని తెలుస్తుంది.ఒకవేళ రూల్స్ కఠినతరం చేయాల్సి వస్తే అధికారులు తప్పకుండా అమలు చేస్తారని తెలుస్తోంది.

Telugu Rule, Rule Bike, India, Peoplesaffraid-

  మరోవైపు యూపీలో మరో కొత్త రూల్ ను అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినాట్లు తెలుస్తుంది.లారీ డ్రైవర్లు లుంగీలు ధరించి డ్రైవింగ్ చేస్తే రూ.2000 జరిమానా విధించాలని చూస్తుంది.మొత్తానికి కొత్త కొత్త రూల్స్ తో వాహనదారులకు అధికారులు చెమటలు పట్టిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube