నూతన జంటయితే ఏంటి... పెళ్లి వేడుకలో తగ్గేదేలే.. వారేం చేశారో తెలిస్తే షాక్

పెళ్లంటే నూరేళ్ల పంట అని నమ్ముతుంటారు చాలా మంది.అటువంటి పెళ్లి కోసం ఎన్నో ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు.

 Newly Wed Couple Looting Money On Stage Viral Video, Viral Video, Groom, Bride,-TeluguStop.com

చాలా మందికి జీవితంలో ఒకే సారి వచ్చే వేడుక పెళ్లి వేడుక.అటువంటి వేడుకను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

ఎలాగైనా సరే తమ పెళ్లి వేడుక పది కాలాల పాటు చిరస్థాయిగా ఉండిపోవాలని ఫొటోలు, వీడియోలు తీయిస్తుంటారు.పాత రోజుల్లో ఓన్లీ వీడియోలు, ఫొటోలే ఉండేవి కానీ ప్రస్తుత రోజుల్లో పెళ్లంటే అనేక హంగూ, ఆర్భాటాలు ఉంటున్నాయి.

వాటి కోసం ఎంత ఖర్చైనా పరవాలేదని పెళ్లి బృందం కూడా వెనుకాడడం లేదు.ఇలా రిచ్ గా పెళ్లి చేసుకోవడం కోసం కొంత మంది స్థోమతకు మించి అప్పులు చేస్తున్నారు.

వాటిని తీర్చేందుకు నానా కష్టాలు పడుతున్నారు.ఇలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లి వేదిక మీద చేసిన పనిని చూసి అందరూ షాకయ్యారు.

వామ్మో ఇలా కూడా ఉంటారా… అని నోరెళ్లబెడుతున్నారు.ఇంతకీ ఆ పెళ్లి జంట ఏం చేసిందంటే.

పెళ్లిలో హంగూ, ఆర్భాటాలకు కొదువే ఉండదు.అలానే ఓ జంట పెళ్లిలో కూడా ఇలాంటి వి చాలానే చేశారు.ఆ జంట మీద నోట్ల కట్టలు కురింపించారు.అక్కడున్న చాలా మంది కింద పడ్డ నోట్లను ఏరుకుంటూ ఉన్నారు.ఇంతలో వరుడు కూడా కిందికి వంగి తన కాళ్ల దగ్గర పడి ఉన్న రూ.2000 నోటును గుట్టు చప్పుడు కాకుండా తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు.వధువేమయినా తక్కువా తిందా? తను కూడా తన భర్తను పిలిచి ఓ నోటు చేతికిచ్చి జేబులో పెట్టుకోమని సైగ చేసింది.ఇదంతా సైలెంట్ గా చేస్తున్నాం.

కాబట్టి ఎవరూ తమను చూడడం లేదని ఆ జంట అనుకుంది.కానీ అక్కడ రికార్డవుతున్న వీడియోలో జంట చేసిన చిలిపి పనులు మొత్తం క్యాప్చర్ అయ్యాయి.

ఇప్పుడు ఆ వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది.ఆ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.

ఎలా ఉందో కామెంట్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube