విడ్డూరం : పెళ్లిలో వరుడి డాన్స్‌ చూసి నీకో దండం అంటూ తాళి తీసి వెళ్లి పోయిందట  

Newly Married Woman Take Divorce Because Of Husband Dance-married Woman,uttar Pradesh Lakhimpura Distict

ఈమద్య కాలంలో పెళ్లిలు అన్నప్పుడు భరాత్‌లు డీజేలు దుమ్ము దుమ్ముగా హంగామా ఉంటున్న విషయం తెల్సిందే.గంటల తరబడి డాన్స్‌లు వేస్తూ కొత్త జంటను బంధు మిత్రలు అభినందించడం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌ డాన్స్‌ల మద్యలో వధు వరులను తీసుకు వచ్చి డాన్స్‌ వేయించడం కూడా ఈమద్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంది.

Newly Married Woman Take Divorce Because Of Husband Dance-married Woman,uttar Pradesh Lakhimpura Distict Telugu Viral News Newly Married Woman Take Divorce Because Of Husband Dance-married Uttar Prade-Newly Married Woman Take Divorce Because Of Husband Dance-Married Uttar Pradesh Lakhimpura Distict

అమ్మాయిలు కాస్త సిగ్గుపడ్డా అబ్బాయిలు మాత్రం డాన్స్‌లు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.అయితే అలా ఒక పెళ్లి కొడుకు డాన్స్‌ వేయడంను చూసిన అమ్మాయి అతడితో కలిసి జీవించడానికి ఒప్పుకోలేదు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తరప్రదేశ్‌ లఖింపూర్‌ జిల్లా మైలానీ ప్రాంతంలో ఒక వివాహ వేడుక జరుగుతోంది.అంతా కూడా ఉత్సాహంగా వివాహ వేడుకలో పాల్గొంటున్నారు.

పెళ్లి తంతు ముగిసింది.పెళ్లి అయిన తర్వాత వరుడి స్నేహితులు డాన్స్‌లు మొదలు పెట్టారు.

మద్యలో వరుడుని కిందకు దించి డాన్స్‌ వేయించారు.ఆ సమయంలోనే వరుడితో బీరు తాపించారు.

వరుడు తాగిన మత్తులో ఊపు వచ్చి బాగా డాన్స్‌ వేస్తున్నాడు.దండలు మార్చుకునేందుకు పిల్చినా కూడా రానంతగా డాన్స్‌ వేస్తున్నాడు.

బంధువులు అంతా కూడా అతడిని బలవంతంగా స్టేజ్‌పైకి తీసుకు వెళ్లారు.అక్కడ అమ్మాయి అబ్బాయి మెడలో దండ వేసుకున్నారు.

వచ్చి పోయే బంధు మిత్రులతో ఫొటోలు దిగారు.మళ్లీ కొద్ది సమయం తర్వాత అబ్బాయి కిందకు దిగాడు.

అక్కడ స్నేహితులతో కలిసి మళ్లీ రెచ్చి పోయి మరీ డాన్స్‌ చేశాడు.ఈసారి ఏకంగా కింద పడుకుని బొర్లాడుతూ నాగిని డాన్స్‌ చేశాడు.

అతడు చేస్తున్న డాన్స్‌కు అమ్మాయికి మాత్రమే కాకుండా ఆమె తరపు బంధువులకు కూడా వెగటు పుట్టింది.

ఇలాంటి చిల్లర వ్యక్తినా నేను చేసుకుందని ఆమె బాధ పడింది.అప్పుడే ఇలాంటి వ్యక్తి నాకు వద్దంటూ అక్కడ నుండి వెళ్లి పోయింది.

పెళ్లి రోజు తాగి ఇలా చేస్తున్నాడంటే పెళ్లి అయిన తర్వాత తర్వాత ఎలా ఉంటాడో అనుకుంటూ పెళ్లి పిల్ల తరపు బంధువులు కూడా అక్కడ నుండి వెళ్లి పోయారు.ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.

ఆ నోట ఈనోట పడి చివరకు మన వరకు వచ్చింది.