నవవధువు హత్యకేసులో బయటపడ్డ అసలు నిజం..

నవ వధువును తన భర్తే హతమార్చిన విషయం అందరికి తెలిసిందే. ప్రియురాలు మత్తులో పడి పెళ్లి అయ్యి 3 నెలలు కూడా నిండక ముందే భార్యను దారుణంగా హతమార్చిన ఘటన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో చోటుచేసుకుంది.

 Newly Married Woman Killed By Husband In Khammam District,crime News, Crime Stor-TeluguStop.com

పోలీసుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తుందని భార్యని హత్య చేసినట్లు చెబుతున్నారు.

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకు చెందిన నాగ శేషు రెడ్డికి నవ్య రెడ్డితో రెండు నెలల క్రితం వివాహం జరిగింది.

నాగ శేషు రెడ్డి నవ్యకు స్వయానా మేనమామ కొడుకు.అతడు పుణేలో జాబ్ చేస్తున్నాడు.నవ్య బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది.సత్తుపల్లి మండలం గంగారంలోని సాయి స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుతుంది.

అయితే రెండు రోజుల క్రితం నాగ శేషు రెడ్డి తన భార్య నవ్య కనిపించడంలేదంటూ ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు.పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి గ్రామ శివార్లలో కుక్కల గుట్ట వద్ద నవ్య రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

Telugu Story, Khammam, Navya Reddy, Telangana, Vineela-Latest News - Telugu

పోలీసులు నాగశేషు రెడ్డిపై అనుమానంతో అతని కదలికలపై నిఘా పెట్టారు.అతనే నవ్య ను చంపి ఉంటాడన్న అనుమానంతో ఆ దిశగా దర్యాప్తు చెయ్యగా అసలు విషయం బయటపడింది.పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా నాగశేషు రెడ్డిను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

నాగశేషు రెడ్డి ఈ నెల 3 వ తారీఖున నవ్యను కాలేజ్ లో దించుతామని బైక్ మీద ఎక్కుంచుకుని వెళ్ళి కుక్కలగుట్ట వద్ద ఆమెకు మత్తు బిళ్లలు కలిపిన నీటిని తాగించాడు.అపస్మారక స్థితిలోకి వెళ్లిన నవ్యను పక్కన ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి చున్నీతో ఉరివేసి దారుణంగా హత్య చేసాడు.

తర్వాత హత్యను ఆత్మహత్యగా చేయాలని భావించి నవ్య ఫోన్ నుండి వాళ్ళ నాన్నకు మెసేజ్ పంపించాడు.

నాన్న నాకు బిటెక్ లో బ్యాక్ లాగ్స్ ఉన్నాయి.

వీటిని పాసవ్వడం న వల్ల కావడం లేదు.అందుకే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నా.

అని నవ్య మొబైల్ నుండి మెసేజ్ పెట్టి ఏమి తెలియనట్లు పోలీసులకు కనిపించడం లేదంటూ కంప్లైంట్ ఇచ్చాడు.తర్వాత పోలీసుల విచారణలో నాగశేషు రెడ్డి నిజం ఒప్పుకోవడంతో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి నిందితుడిని అరెస్ట్ చేసారు.

వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.

అయితే పోలీసులు ఈ విషయంపై నాగశేషు రెడ్డి సమీప బంధువైన వినీలను విచారించి.

ఆమె ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.అవసరం అయితే మళ్ళీ వస్తామని చెప్పి వెళ్లిపోయారు.

అనంతరం ఏమైనదో ఏమో తెలియదు కానీ వినీల పెగాళ్లపాడు రైల్ ట్రాక్ క్రింద పడి ఆత్మహత్య చేసుకుంది.ఈమె ఆత్మహత్య పలు అనుమానాలను కలిగిస్తుంది.

పోలీసులు ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube