పెళ్ళైన పది రోజులకే భర్తను అరెస్ట్ చేయించిన ప్రముఖ నటి!

కొన్ని పెళ్లిళ్లు మూడునాళ్ళ ముచ్చటగా మారుతుంటాయ్.ఇక అలానే ఇప్పుడు స్టార్ హీరోయిన్ పరిస్థితి కూడా అయిపొయింది.

 Newly Married Poonam Pandey Filed Case On Sam Bambey-TeluguStop.com

పెళ్లి ఈ నెలలోనే జరిగింది.ఆమె తన భర్త ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పెళ్లి జరిగినట్టు ప్రకటించింది.

హనీమూన్ కి కూడా వెళ్లినట్టు గోవాలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను నెట్టింట్లో తన అభిమానులతో పంచుకుంది.

 Newly Married Poonam Pandey Filed Case On Sam Bambey-పెళ్ళైన పది రోజులకే భర్తను అరెస్ట్ చేయించిన ప్రముఖ నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతలో ఏమైందో మరి.ఉన్నట్టుండి భర్తపై కేసు పెట్టి అరెస్ట్ చేయించింది.ఎవరు అనుకుంటున్నారా? ఆమెనండి.బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే.బాలీవుడ్ హీరోయిన్ అయినా పూనమ్ పాండే తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ గా మారింది.ఇంటర్నెట్ సెన్సేషన్ పూనమ్ పాండే, సామ్ బోంబేను ఇటీవల పెళ్లి చేసుకుంది.హనీమూన్ కు గోవాకు వెళ్లిన ఈ భామ అక్కడ ఓ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది.

ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ హనీమూన్ లో ఉన్నట్టు తెలిపింది.

అయితే ఏ విషయంపైనా గొడవ అయ్యిందనేది బయటకు రాలేదు కానీ భర్త ఆమెను వేధించినట్టు, హింసించి దాడి చేశాడని పూనమ్ పాండే సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో గోవా పోలీసులు అతన్ని నిన్న కొనలో అరెస్ట్ చేశారు.ఈ విషయంపై స్పందించిన పోలీసులు పూనమ్ పాండే చేసిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
కాగా పూనమ్ పాండేను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.ఇది ఇలా ఉండగా పూనమ్ పాండే భర్త సామ్ బాంబే కొన్ని రోజుల క్రితమే పూనమ్ తో కలిసి తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలిగించాడు.

మరి వారిద్దరి మధ్య ఎందుకు తేడాలు వచ్చాయ్ అనేది తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాలసిందే.

#PoonamPandey #Sam Bombay #Sam Bambey #NewlyMarried #Poonam Pandey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు