టిక్ టాక్ కు మరో నిండు ప్రాణం బలి ,ఎక్కడంటే  

Newly Married Man Doing Tik Tok On Tractor - Telugu 23 Years Kapil, Newly Married Man Passed Away While Performing Stunts On Tractor For Tiktok Video, Tik Tok Latest Upadte, Tik Tok On Tractor, Tik Tok Tractor Stunts, Tik Tok , Uttarpradesh Muzaffarbagar

టిక్‌టాక్‌ దీని పేరు చెప్పగానే అందరూ చాలా ఎగ్జైట్ అయిపోతుంటారు.ఎందుకంటే ఈ టిక్ టాక్ లో వీడియో లు తీసి షేర్ చేసి పాపులర్ అవ్వాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

 Newly Married Man Doing Tik Tok On Tractor

ఈ క్రమంలో కొందరు తమ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు.అంతగా టిక్ టాక్ పై మోజు పెంచుకుంటున్న జనాలు ఎన్ని దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నప్పటికీ కూడా తమ పిచ్చిని మాత్రం వదులుకోవడం లేదు.

ఈ క్రమంలోనే టిక్ టాక్ మోజులో పడి ఒక కొత్త పెళ్లి కొడుకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగింది.

టిక్ టాక్ కు మరో నిండు ప్రాణం బలి ,ఎక్కడంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కొత్తగా పెళ్లయిన 23ఏళ్ళ కపిల్‌ వేగంగా వెళుతున్న ట్రాక్టర్‌పై టిక్‌టాక్‌ కోసం స్టంట్స్‌ చేస్తుండగా అది కాస్త బోల్తా పడడం తో కపిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.రెండు నెలల క్రితమే వివాహమైన కపిల్ ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం తో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

హోలీ వేడుకల సందర్భంగా కిందిదియా గ్రామంలో ట్రాక్టర్‌ నడుపుతూ స్టంట్స్‌ చేస్తుండగా మరో వ్యక్తి మొబైల్‌ ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు.

అయితే స్టీరింగ్‌పై పట్టుతప్పిన క్రమంలో ట్రాక్టర్‌ బోల్తా పడింది.

దీనితో కపిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.ట్రాక్టర్‌ అదుపుతప్పడంతో ముందు టైర్లకు వేలాడిన కపిల్‌ వాహనం కింద పడి మరణించాడు.

అయితే పోలీసులకు సమాచారం అందించకుండానే కపిల్‌ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Newly Married Man Doing Tik Tok On Tractor Related Telugu News,Photos/Pics,Images..

footer-test