అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ లో హీరోయిన్ శ్రియ శర్మ కాదట.! మరెవరో తెలుసా.?     2018-07-07   01:16:42  IST  Raghu V

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతో హీరో విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. సంచలన దర్శకుడు బాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయింది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా చిత్రీకరించేశారు. కానీ హీరోయిన్ ఎవరనే విషయాన్ని మాత్రం దర్శక, నిర్మాతలు గోప్యంగా ఉంచుతున్నారు.

బాలనటిగా సత్తా చాటి ఇటీవల నిర్మలా కాన్వెంట్ సినిమాతో హీరోయిన్ గా మారిన శ్రియ శర్మనే ఇందులో హీరోయిన్ అని ఇండస్ట్రీ లో టాక్. వాస్తవానికి తెలుగులో బాల నటిగా శ్రియాకు ‘జై చిరంజీవ’ సినిమా మొదటిది. అందులో చిరంజీవి మేనకోడలు లావణ్యగా శ్రియా నటించింది. ఆ తరవాత ‘దూకుడు’, ‘రచ్చ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘తూనీగ తూనీగ’ చిత్రాల్లోనూ బాల నటిగా కనిపించింది. , ‘నిర్మలా కాన్వెంట్ లో హీరోయిన్ గా కనిపించింది.

తెలుగులో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండేనే తమిళంలో కూడా తీసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం హీరోయిన్ మారింది. బెంగాళీ మోడ‌ల్ మేఘా చౌద‌రి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.