తగ్గేదేలే... న్యూజిలాండ్ ప్రధాని మరో సంచలన నిర్ణయం, అక్లాండ్‌లో లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా మహమ్మారిని అద్భుతంగా నిలువరించి ప్రపంచ దేశాల మన్ననలు పొందిన న్యూజిలాండ్‌లో తాజాగా వైరస్ అడుగుపెట్టింది.దాదాపు ఆరు నెలల తర్వాత అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది.

 New Zealands Auckland To Stay In Lockdown For 2 More Weeks , Prime Minister Jaci-TeluguStop.com

ఆక్లాండ్ నగరంలోని ఓ 58 ఏళ్ల వ్యక్తిలో డెల్టా వేరియంట్ ను గుర్తించారు.ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి సంచలనం సృష్టించారు న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్.

అయితే ఏ చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భావించిన ఆమె.అక్లాండ్‌లో లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నారు.తాజాగా ఇక్కడ మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రధాని జెసిండా ఆర్డెర్న్ సోమవారం ప్రకటించారు.

ఫిబ్రవరిలో స్వల్పంగా కేసులు తప్పించి.

న్యూజిలాండ్ చాలా నెలల పాటు వైరస్ రహితంగానే వుంది.ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో ఆస్ట్రేలియా నుంచి డెల్టా వేరియంట్.

దేశంలోకి ప్రవేశించింది.దేశం మొత్తం మీద కరోనా కేసులు 562కి చేరుకోగా.

రోజువారీ కేసుల సంఖ్య సోమవారం అత్యల్పంగా 53గా నమోదైంది.

ఇదే సమయంలో ఫైజర్ – బయోఎంటెక్ టీకా వేసుకున్న ఓ వ్యక్తి మరణించడం న్యూజిలాండ్‌లో కలకలం రేపింది.

ఈ నేపథ్యంలో ప్రధాని ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.దేశంలో వైరస్ వ్యాప్తి తక్కువగా వుందని, దీనిని ఇలాగే కొనసాగించాల్సిన అవసరం వుందని అన్నారు.దీనిలో భాగంగా 1.7 మిలియన్ల మంది అక్లాండ్ వాసులు మరో రెండు వారాల పాటు కఠినమైన లాక్‌డౌన్ -4లో వుంటారని జెసిండా తెలిపారు.అయితే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం లెవల్ 3 లాక్‌డౌన్‌ను అమలు చేస్తామంటూ సడలింపులు ప్రకటించారు ప్రధాని.

Telugu Australia, Delta, Myocarditis, Zealand, Pfizerbioentech, Primejacinda-Tel

తొలి విడత కరోనా వెలుగు చూసిన 2020 మార్చి నుంచి న్యూజిలాండ్‌ అంతర్జాతీయ సరిహద్దును మూసివేసిన సంగతి తెలిసిందే.నాటి నుంచి ఇదే వైఖరిని అవలంభిస్తూ కట్టుదిట్టమైన చర్యల ద్వారా ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కరోనాను కట్టడి చేసి ప్రశంసలు పొందారు.అయితే ప్రభుత్వం ఆలస్యంగా వ్యాక్సిన్ విడుదల చేయడంతో పాటు ధరలు, ఖర్చుల పెరుగుదల వంటి విమర్శలను జెసిండా ప్రభుత్వం ఎదుర్కొంటోంది.5.1 మిలియన్ల మంది జనాభా వున్న న్యూజిలాండ్‌లో 21 శాతం మంది పూర్తిగా టీకాలు తీసుకున్నారు.ఓఈసీడీ గ్రూపులోని సంపన్న దేశాల్లో న్యూజిలాండ్‌దే అత్యంత పేలవమైన వ్యాక్సినేషన్ రేటు.

కాగా, ఫైజ‌ర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మ‌హిళ చ‌నిపోయిన‌ట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

అయితే ఆ మ‌హిళ వ‌య‌సు ఎంత అన్న‌ది మాత్రం చెప్ప‌లేదు.ఫైజ‌ర్ వ్యాక్సిన్ వ‌ల్ల క‌లిగే అత్యంత అరుదైన అనర్థం అయిన మ‌యోకార్డిటిస్ (గుండె కండ‌రాల్లో ఇన్‌ఫ్లేమేష‌న్‌) వ‌ల్లే ఆ మ‌హిళ చనిపోయిన‌ట్లుగా భావిస్తున్నారు.

తద్వారా ఫైజ‌ర్ కొవిడ్‌-19 వ్యాక్సిన్ వ‌ల్ల న్యూజిలాండ్‌లో సంభ‌వించిన తొలి మ‌ర‌ణం ఇదేనని ప్రభుత్వం ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube