దెబ్బకి దెబ్బ...! ప్రతీకారం తీర్చుకున్న న్యూజిలాండ్....

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి భారత్ – న్యూజిలాండ్ వన్డే సిరీస్లో న్యూజిలాండ్ జట్టు విజయాల పరంపరను కొనసాగిస్తూ మూడో వన్డే మ్యాచ్ లో  కూడా విజయం సాధించి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 3-0 తో  కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేసింది.

 New Zealand Won The 3rd Match One Day-TeluguStop.com

తాజాగా ఈ రోజు జరిగినటువంటి మౌంట్ మాంగనుయ్ లో జరిగినటువంటి వన్డే మ్యాచ్ లో మొదటగా భారత్ జట్టు బ్యాటింగ్ చేసింది.

ఇందులో భాగంగా 296 పరుగుల పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు ముందు ఉంచింది.అయితే ఇందులో లోకేష్ రాహుల్ అజేయ సెంచరీతో (112) రాణించగా శ్రేయస్ అయ్యర్ (62) మనీష్ పాండే (42)లు ఫర్వాలేదనిపించారు.

అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి న్యూజిలాండ్ జట్టు లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేదించింది.ఇందులో ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్ (66) మరియు హెన్రీ నికోలస్ (80) నిలకడగా రాణించడంతో చేదించాల్సిన లక్ష్యం మరింత సులువుగా మారింది.

అలాగే చివర్లో గ్రాండ్ హుమ్ తనదైన శైలిలో హిట్టింగ్ చేస్తూ మిగిలిన పని పూర్తి చేశాడు.మొత్తానికి 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.

Telugu India Day, India Zealand, Zealand, Zealand Day, Zealand Won, India-Sports

దీంతో న్యూజిలాండ్ జట్టు మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి సిరీస్ సొంతం చేసుకుంది.అయితే ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగినటువంటి ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ భారత్ జట్టు క్లీన్ చేసి న్యూజిలాండ్ జట్టుకు సవాల్ విసిరింది.దీంతో న్యూజిలాండ్ జట్టు అందుకు ప్రతీకారంగా వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి బదులు తీర్చుకుంది.అయితే ఇక న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా 2 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఈ నెల 21 వ తారీఖున ప్రారంభం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube