అక్కడి కరోనా జీరో...సంతోషంతో డ్యాన్స్ చేసిన ప్రధాని..!!!

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి ధాటికి అల్లకల్లోలం అయ్యిపోయింది.ముఖ్యంగా అమెరికా వ్యాప్తంగా కరోనా సృష్టించిన అలజడి అంతాయింతా కాదు.

 New Zealand, With Zero Active Cases, Pm Jacinda Ardern , Ardern Covid-19-TeluguStop.com

ముఖ్యంగా అమెరికా ఆర్ధిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయ్యిపోవడానికి కారణం కరోనా మహామ్మారే కారణం.అయితే న్యూయార్క్ తరువాత కరోనా మహమ్మారి అత్యధిక కేసులు నమోదైనది న్యూజిల్యాండ్ లోనే.

కరోనా మహమ్మారి నుంచీ తమ ప్రజలని కాపాడుకోవాలని, తమ ప్రాంతాన్ని కాపాడుకోవాలని ప్రధాని ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రధానిగా ఆర్డర్న్ ఎంతో బాధ్యతా యుతంగా ప్రవర్తించిన తీరు సత్పలితాలని ఇచ్చింది.

కరోనా జీరో ప్రాంతంగా వైద్య బృందాలు వెల్లడించడంతో ఆమె ఉండబట్టలేక పోయింది.ఆమె సంతోషానికి అవధులు లేవు.

వైద్య బృందం కరోనా జీరో గా న్యూజిల్యాండ్ ని ప్రకటించడం వీక్షించిన ఆర్డర్న్ తన కూతురుతో కలిసి డ్యాన్స్ వేసిందని స్థానిక మీడియా తెలిపింది.చివరి సారిగా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి కోలుకోవడంతో కరోనా జీరో అయ్యిందని వైద్యులు తెలిపారు.ఇదిలాఉంటే

Telugu Ardern Covid, Zealand, Zero Active-

గడించిన 15 రోజులుగా సుమారు న్యూజిల్యాండ్ వ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి పరీక్షలు చేశారని ఎవరికీ కూడా కరోనా పాజిటివ్ రాలేదని తెలిపారు.50 లక్షలు జనాభా కలిగిన న్యూజిల్యాండ్ లో సుమారు 3 లక్షల మందికి కరోనా టెస్ట్ లు చేశారు.ఈ విషయాన్ని మీడియా సమావేశంలో ఆమె ప్రకటించారు.ఇక్కడితో అంతా అయిపోయిందని అనుకోవద్దు కరోనా నుంచీ మరి కొంత కాలం మనం అప్రమత్తంగా ఉండాలని ప్రధాని ఆర్డర్న్ హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube