ఆరు నెలల తర్వాత తొలి కోవిడ్ మరణం.. ఉలిక్కిపడ్డ న్యూజిలాండ్

తొలి దశ కరోనా వైరస్‌ను అద్భుతంగా కంట్రోల్ చేసి మన్ననలు అందుకున్న న్యూజిలాండ్‌లో దాదాపు ఆరు నెలల తర్వాత తొలి మరణం సంభవించింది.90 ఏళ్ల వృద్ధురాలు అంతర్గత అనారోగ్య సమస్యల కారణంగా వెంటిలేటర్, ఐసీయూ సపోర్ట్ పొందలేక శుక్రవారం రాత్రి అక్లాండ్‌లోని ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయిందని న్యూజిలాండ్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.కరోనా వల్ల న్యూజిలాండ్‌లో సంభవించిన 27వ మరణం ఇదే.ఈ ఏడాది ఫిబ్రవరి 16 తర్వాత కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన తొలి వ్యక్తి ఆ వృద్ధురాలే కావడం గమనార్హం.

 New Zealand Records First Covid-related Death In 6 Months ,  New Zealand,  Auckl-TeluguStop.com

ఆమెను 1.7 మిలియన్ల జనాభా కలిగిన న్యూజిలాండ్‌లో అతిపెద్ద నగరమైన అక్లాండ్‌లో ఇప్పటికే పాజిటివ్‌గా తేలిన కుటుంబానికి చెందిన మహిళగా అధికారులు గుర్తించారు.ఆ వృద్ధురాలి మరణం పట్ల న్యూజిలాండ్ ప్రధాని జేసిండా ఆర్డెర్న్ సంతాపం ప్రకటించారు.కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటున్న సమయంలో ఆమె మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతర్లీనంగా ఆరోగ్య సమస్యలు వున్న వారికి ముప్పు ఎక్కువగా వుందని ప్రధాని అన్నారు.మరోవైపు న్యూజిలాండ్‌లో గడిచిన వారాంతంలో 84 కరోనా కేసులు నమోదవ్వగా.అది శనివారం నాటికి 20కి తగ్గాయి.ఈ సందర్భంగా హెల్త్ డైరెక్టర్ కరోలిన్ మెక్‌ఎన్‌లే మాట్లాడుతూ.

గడిచిన వారం రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయన్నారు.వైరస్ వ్యాప్తిని విచ్ఛిన్నం చేయడంలో తాము విజయం సాధించామని కరోలిన్ చెప్పారు.

కాగా, దాదాపు ఆరు నెలల తర్వాత ఇటీవల న్యూజిలాండ్‌‌లో తొలి కరోనా కేసు నమోదైంది.ఆక్లాండ్ నగరంలోని ఓ 58 ఏళ్ల వ్యక్తిలో డెల్టా వేరియంట్ ను గుర్తించారు.

ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు ప్రధాని జేసిండా.అలాగే వైరస్ వెలుగుచూసిన ఆక్లాండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఆంక్షలు విధించారు.

ఈ కేసును డెల్టా వేరియంట్‌గా అనుమానిస్తున్నారు.గత ఆరు నెలలుగా ఒక్క కరోనా కేసు నమోదు కానప్పటికీ.

డెల్టా వేరియంట్ నేపథ్యంలో ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని ప్రధాని అన్నారు.తక్షణమే మనం స్పందించని పక్షంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని.

ఇతర దేశాలను చూసి తెలుసుకోవచ్చని జెసిండా చెప్పారు.

Telugu Auckland, Delta, Carolyn Mcenroe, Lock, Zealand, Zealand Covid, Primejaci

డెల్టా వేరియంట్ బారిన పడకుండా ఉండేందుకు కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుందని ప్రధాని తెలిపారు.డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతూ.దీని వల్ల ప్రస్తుతం ఆస్ట్రేలియా పడుతున్న ఇబ్బందులను ఆమె ఉదహరించారు.

కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం వల్లే కరోనాను న్యూజిలాండ్ కట్టడి చేయగలిగిందని జెసిండా గుర్తుచేశారు.ప్రారంభంలోనే లాక్ డౌన్ విధించడం వల్ల కొన్ని రోజులు మాత్రమే మనకు ఇబ్బంది ఉంటుందని.

అలసత్యం ప్రదర్శించి, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటే నెలల తరబడి లాక్ డౌన్ లో ఉండాల్సి వస్తుందని ఆమె అప్పట్లోనే హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube