కృష్ణుని గుడిలో న్యూజిలాండ్ ప్ర‌ధాని.. కారణం ఏంటంటే!

ఇటీవల కాలంలో ప్రతిదీ వైరల్ అవుతుంది.ఎన్నో విషయాలపై తప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.

 New Zealand Pm, Hindu Temple, Coronavirus, Covid-19-TeluguStop.com

ఇంకా అలానే ఇప్పుడు కూడా ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అది ఏంటి అంటే? క‌రోనాను నిర్మూలించినందుకుగానూ న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ ఆక్లాండ్‌లోని రాధాకృష్ణుల ఆల‌యాన్ని సందర్శించారని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇంకా ఆ వీడియోలో ఆమె ఆలయంలోకి ప్రవేశించే ముందు తన పాదరక్షలను బయటే వదిలి గుడిలోకి వెళ్లారు.హార‌తి పూజలో పాల్గొన్నారు.అనంతరం ప్రసాదం తీసుకున్నారు.అంతేకాదు ఆమె భారతీయ సాంప్రదాయ వంటకాలు అయినా పూరీ, పప్పును తింటున్న ఫోటోలను కూడా షేర్ చేశారు.

దీంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే కరోనా ఫ్రీ కంట్రీగా ప్రకటించే సమయంలో ఆమె హిందూ ఆలయానికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతుంది.

కానీ నిజానికి జెసిండా ఆర్డ‌ర్న్‌ గుడికి వెళ్లారు కానీ కరోనా వైరస్ కట్టడికి వెళ్ళలేదు.ఎన్నికలకు ముందు ఆలయానికి ఆమె వెళ్లారు.అంతేకాదు కోవిడ్ ఫ్రీ దేశంగా ప్రకటించినప్పటికీ మల్లి కొత్త కేసులు వచ్చాయి.

ఆతర్వాత వంద రోజుల పాటు కరోనా కేసు ఒక్కటి కూడా నమోదవ్వలేదు.

నిన్న మంగళవారం కొత్త కేసులు బయటపడ్డాయి.అలాగే ప్రస్తుతం న్యూజిలాండ్ కరోనా ఫ్రీ దేశం కాదు.

ఇంకా న్యూజిలాండ్ ప్ర‌ధాని జెసిండా ఆర్డ‌ర్న్ క‌రోనాను క‌ట్ట‌డి చేసినందుకు హిందూ ఆల‌యాన్ని సంద‌ర్శించ‌లేదు.

https://www.videogram.com/comic/ca35b061-c1cf-4905-b6c0-4d80ca6e80af

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube