న్యూజిలాండ్‌ మంత్రి ఘనకార్యం: లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో బీచ్ వెళ్లాడు.. పదవి ఊడింది

కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.ప్రజలు అత్యవసరమైతే తప్పించి ఇల్లు దాటి బయటకు రావొద్దని ఆయా దేశ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

 New Zealand Health Minister Demoted, Isolation, Lockdown, New Zealand, Nationwid-TeluguStop.com

అయినప్పటికీ కొందరు అధికారుల మాటను లెక్కచేయడం లేదు.ప్రజల సంగతి పక్కనబెడితే బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా న్యూజిలాండ్ మంత్రి ఒకరు లాక్‌డౌన్ ఉన్నప్పటికీ కుటుంబంతో కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేశాడు.దీనిని తీవ్రంగా పరిగణించిన ఆ దేశ ప్రధాని.

సదరు మంత్రిని పదవిలోంచి తొలగించారు.

ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి డేవిడ్ క్లార్క్‌ ఐసోలేషన్ కాలంలో మౌంటెన్ బైకింగ్ చేసినందుకు గాను ఇప్పటికే విమర్శలు ఎదుర్కొన్నారు.

ఈ క్రమంలో తాను కుటుంబంతో కలిసి బీచ్‌లో 20 కిలోమీటర్లు వాకింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు.అంతేకాకుండా తనను తాను ఇడియట్ అని సంబోధించుకున్నాడు.సాధారణ పరిస్ధితుల్లోనే తాను క్లార్క్‌ను తొలగించానని, ప్రస్తుతం కోవిడ్ 19పై పోరాటంలో ఇది తప్పనిసరి నిర్ణయమని ప్రధాని జేసిండా ఆర్డెర్న్‌ తీవ్రంగా వ్యాఖ్యానించారు.తాను మంచిని మాత్రమే ఆశిస్తున్నానని, దేశం కూడా అలాగే భావిస్తోందని ఆమె అన్నారు.

Telugu Lockdown, Zealand, Rugby-

ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే ఆల్ బ్లాక్ రిచీ మెయింగా అనే రగ్బీ ఆటగాడు తన జట్టులోని కొందరు సభ్యులతో కలిసి క్రైస్ట్‌చర్చ్‌లోని ఓ పార్క్‌లో శిక్షణ పొందారు.ఈ విషయం కాస్తా న్యూజిలాండ్ రగ్బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ రాబిన్సన్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు.కరోనా దృష్ట్యా లాక్‌డౌన్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలన్నారు.ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో రగ్బీ ఆటగాళ్ల చర్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రాబిన్‌సన్ అన్నారు.

ప్రజలంతా కరోనాకు భయపడుతున్న సమయంలో ఓ వ్యక్తి సూపర్‌మార్కెట్లు వద్ద కావాలని తుమ్మడం, దగ్గడం చేశాడు.అతను చేసిన చిలిపి పనికి కటకటాల పాలయ్యాడు.

కరోనాను కట్టడి చేయడం కోసం న్యూజిలాండ్ ప్రభుత్వం మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు.మరోవైపు స్కాట్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కేథరీన్ కాల్డర్‌వుడ్.

ఎడిన్ బర్గ్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లినందుకు పదవికి రాజీనామా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube