న్యూయార్క్‌ను గాడిలో పెట్టేందుకు కమీషన్: ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు  

New Yorks Commission Indian Americans - Telugu America, Andrew Cuomo, Blue Ribbon Commission, Corona Virus, Governor, Lock Down, New York, Satish Tripathi, Siddhartha Mukherjee

కరోనాను కట్టడి చేసేందుకు గాను అమెరికాలో విధించిన లాక్‌డౌన్ కారణంగా అక్కడి ఆర్దిక వ్యవస్ధ అతలాకుతలమైంది.ముఖ్యంగా ఐటీ, హోల్‌సేల్, రిటైల్, ఉత్పత్తి, ట్రాన్స్‌పోర్ట్, హోటల్ వంటి రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

 New Yorks Commission Indian Americans

ఆ దేశ ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌ నగరంలో పరిస్ధితి మరింత తీవ్రంగా తయారైంది.నిద్రపోని నగరంగా పేరున్న ఈ నగరంలో ప్రజలకు కరోనాపై భయం కంటే.

ఆర్ధికంగా నష్టపోతున్నామనే బాధ ఎక్కువగా ఉంది.

న్యూయార్క్‌ను గాడిలో పెట్టేందుకు కమీషన్: ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఈ నేపథ్యంలో కోవిడ్ 19 కారణంగా చోటు చేసుకున్న ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కి తిరిగి గాడిలో పెట్టేందుకు గాను న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో 15 మంది నిపుణులతో బ్లూ రిబ్బన్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు.

ఇందులో ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు కల్పించారు.పులిట్జర్ బహుమతి గ్రహీత, ప్రముఖ వైద్యుడు సిద్ధార్థ ముఖర్జీ, విద్యా వేత్త సతీశ్ త్రిపాఠిలకు గవర్నర్ ఈ అవకాశం కల్పించారు.

గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ ఈ బ్లూ రిబ్బన్ కమీషన్‌‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.ఈ 15 మంది కమీషన్ సభ్యులలో రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ ఛైర్మన్ రిచర్డ్ పార్సన్స్, ఫోర్డ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డారెన్ వాకర్, కార్నెల్ యూనివర్సిటీ అధ్యక్షుడు మార్తా పొలాక్, ఐబీఎం ఛైర్మన్ గిన్ని రోమెటీ ఉన్నారు.

భారతదేశంలో జన్మించిన సిద్ధార్థ ముఖర్జీ కొలంబియా మెడికల్ సెంటర్‌లో హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.ఆయన రచించిన ‘‘ ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మలాడీస్: ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్’’ పుస్తకానికి 2011లో ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతి దక్కింది.ఇక సతీశ్ త్రిపాఠి విషయానికి వస్తే.భారత్‌లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.టొరంటో వర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్, అల్బెర్టా వర్సిటీ, బనారస్ విశ్వవిద్యాలయం నుంచి స్టాటిస్టిక్స్‌లో మాస్టర్ డిగ్రీలను పొందారు.అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీస్, అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ల్యాండ్- గ్రాంట్ యూనివర్సిటీ డైరెక్టర్ల బోర్డులో సతీశ్ పనిచేస్తున్నారు.

కాగా అమెరికాలో ఇప్పటి వరకు 1.68 మిలియన్ల మంది కరోనా బారినపడగా, 98,024 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇక న్యూయార్క్ విషయానికి వస్తే అక్కడ ఇప్పటి వరకు 3,61,515 మందికి వైరస్ సోకగా, 23,282 మంది మరణించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test