న్యూయార్క్: భారత్ నుంచి నిషేధిత వస్తువుల దిగుమతి.. దోషిగా తేలిన అమెరికన్ పౌరుడు

భారత్ నుంచి నిషేధిత వస్తువులను చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకున్న అమెరికన్ పౌరుడిని అక్కడి కోర్టు దోషిగా తేల్చింది.అతనిపై మనీలాండరింగ్ అభియోగాలు కూడా వున్నాయి.

 New Yorker Convicted Of Importing Illegal Controlled Substances From India New Yorker, Importing Illegal , America, India, America,us Attorney, Money Laundering-TeluguStop.com

ఈ మేరకు న్యూయార్క్‌కు చెందిన వ్యక్తిని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ దోషిగా తేల్చినట్లు యూఎస్ అటార్నీ తెలిపారు.నిందితుడిని న్యూయార్క్‌లోని క్వీన్స్‌కు చెందిన ఎజిల్ సెజియన్ కమల్‌దాస్‌గా గుర్తించారు.

అతని నేరం రుజువైతే దాదాపు 50 ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది.

 New Yorker Convicted Of Importing Illegal Controlled Substances From India New Yorker, Importing Illegal , America, India, America,us Attorney, Money Laundering-న్యూయార్క్: భారత్ నుంచి నిషేధిత వస్తువుల దిగుమతి.. దోషిగా తేలిన అమెరికన్ పౌరుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిందితుడు శిక్షార్హమైన మాదక ద్రవ్యాల వ్యాపారి అని.అతను డ్రగ్స్‌కు బానిసగా మారడమే కాకుడా , అందువల్ల కలిగే దుష్ప్రభావాలను పరిగణనలోనికి తీసుకోకుండా మిలియన్లకొద్దీ ఓపియాయిడ్లు, మిస్ బ్రాండెడ్ ప్రిస్క్రిప్షన్ మాత్రలను బ్లాక్ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకున్నాడని యూఎస్ అటార్నీ బ్రయోన్ శాంతి పేర్కొన్నారు.భారత్ నుంచి చట్టవిరుద్ధంగా నిషేధిత మందులను దిగుమతి చేసుకోవడంతో పాటు అమెరికాలోని కొందరి నుంచి వీటి కోసం ఆర్డర్‌లను తీసుకోవడం వరకు ఇలా ప్రతి దానికి నిందితుడు బాధ్యత తీసుకోవాల్సి వుంటుందన్నారు.

ఫెడరల్ ప్రాసిక్యూటర్‌ల కథనం ప్రకారం.మే 2018 నుంచి ఆగస్టు 2019 మధ్యకాలంలో కమల్ దాస్ ఇతరులతో కలిసి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కుట్రలో పాల్గొన్నాడు.

ఇందులో ట్రామాడోల్ అనే సింథటిక్ ఓపియాయిడ్ తో సహా మిస్ బ్రాండెడ్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ను భారత్ నుంచి అమెరికాకు అక్రమంగా దిగుమతి చేసుకున్నాడు.జమైకా, క్వీన్స్ లాండ్ లోని ఒక గిడ్డంగిలో పనిచేసే పిల్ మిల్లు, అమెరికా అంతటా వున్న వినియోగదారులకు యూఎస్ మెయిల్ ద్వారా ఈ మందులను రవాణా చేశాడు.

కుట్ర సమయంలో కమల్ దాస్, అతని వద్ద పనిచేసిన వ్యక్తులు మిలియన్ల కొద్దీ ట్రామాడాల్ మాత్రలను పంపిణీ చేశారు.కొన్ని సార్లయితే వందల, వేల మాత్రలను ఈ ముఠా కొనుగోలు చేసింది.

అంతేకాకుండా కమల్ దాస్ మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆపరేషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనీలాండరింగ్ చేసేందుకు కుట్రపన్నాడు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube