భారత ఎన్నారై..అమెరికన్ మేయర్..అరెస్ట్..ఎందుకంటే..?  

New York Politician Convicted Of Taking Bribes From Indian-origin-indian-origin Restaurant,taking Bribe,us Federal Court

న్యూయార్క్ లో హరేంద్ర సింగ్ అనే ఎన్నారై స్థానికంగా ఓ ప్రముఖ రెస్టారెంట్ నడుపుతున్నాడు. అయితే పేరుమోసిన రెస్టారెంట్ కావడంతో అదే పేరుతో వేరొక చోట మరొక రెస్టారెంట్ ప్రారంభించాలని అనుకున్నాడు. ఆ నిర్మాణం ప్రభుత్వ భూమిలో చేయడానికి ప్రయత్నాలు చేశాడు అందులో భాగంగానే , బ్యాంకు రుణాలు, ప్రభుత్వ స్థలాల లీజుల కోసం అడ్డదారులు తొక్కాడు...

భారత ఎన్నారై..అమెరికన్ మేయర్..అరెస్ట్..ఎందుకంటే..?-New York Politician Convicted Of Taking Bribes From Indian-origin

అందుకు తగ్గట్టుగా ,ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేయడానికి ఆ ప్రాంత మేయర్‌ ఎడ్వర్డ్ మేంగనో కి లంచం ఎరగా వేసి అన్ని అనుమతులు తెచ్చుకున్నాడు. బ్యాంకు రుణాల్లో వచ్చిన సమస్యలకు ప్రభుత్వం హామీ ఉంటుందని చెప్పి కొన్ని వందల కోట్ల రూపాయల తెచ్చుకున్నాడు. అంతా సాఫీగా సాగుతుందని అనుకున్న సమయంలో.

కొత్త రెస్టారెంటు నిర్మాణం ప్రభుత్వ భూమిలో జరగుతుండటంతో దర్యాప్తు చేసిన అధికారులు తీగ మొత్తం లాగితే డొంక కదిలింది. అప్రూవర్‌గా మారిన హరేంద్ర మొదటి నుంచీ జరిగింది అంతా పూస గుచ్చినట్టు చెప్పేశాడు. దాంతో మేయర్ ఎడ్వర్డ్ తప్పులు కూడా బయట పడ్డాయి. ఇప్పుడు వీరు ఇద్దరు పోలీసుల కస్టడీలో ఉన్నారు.