అమెరికాలో ఈ కొత్త రూల్స్ బ్రేక్ చేస్తే 5000 డాలర్ల జరిమానా..!!!

ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కరోనా మహమ్మారి.దాదాపు అన్ని దేశాలపై తన ప్రభావాన్ని చూపించింది.

 New Rules, America, 5000 Dollars Fine,andrew, Newyork Governor, Corona Cases-TeluguStop.com

ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కరోనా అమెరికన్స్ కి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా 2 మిలియన్ కి పైగా కరోనా కేసులు నమోదు కాగా సుమారు లక్ష ఇరవై వేల మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఇప్పటికే ప్రజలు అమెరికాలో యదేశ్చగా తిరిగేస్తున్నారు.దాంతో అమెరికాలోని కొన్ని రాష్ట్రాలలో కరోనా ప్రభావం తీవ్రస్థాయికి చేరుకుంది.

ఈ క్రమలోనే ఆయా రాష్ట్రాలలో స్వీయ నిర్భంధాన్ని ఏర్పాటు చేశారు.

కరోనా మహమ్మారి రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతోందని దాంతో భవిష్యత్తులో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపధ్యంలో ఈ స్వీయ నిర్భంధాన్ని అమలులోకి తీసుకువచ్చారు.

రాబోయే 14 రోజులు అమెరికాలో అత్యంత కీలకమని తెలిపారు.అలబామా, అరోజోనా , ఫ్లోరిడా, నార్త్ కరోలినా , సౌత్ కరోలినా టెక్సాస్, వాషింగ్టన్ లలో తీవ్రత ఎక్కువగా ఉందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ తెలిపారు.

ఇదిలాఉంటే వాషింగ్టన్ విస్వవిదాలయ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.ప్రస్తుతం అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 1.20 లక్షలు ఉందని అయితే స్వీయ నిర్భంధం గనుకా లేకపోతే అక్టోబర్ నాటికి ఈ మరణాలు సుమారు 1.80 లక్షలకి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు.న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ ఈ పరిస్థితులని ఉదాహరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిభందనలు అతిక్రమిస్తే 1000 నుంచీ 5000 వేల డాలర్ల జరిమాన విధిస్తామని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube