బిడెన్ హయాంలో మొదటి వేటు...న్యూయార్క్ గవర్నర్ రాజీనామా...!!

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ భాద్యతలు చేపట్టిన తరువాత అధికారులు, నేతలను ఉద్దేశించి ప్రసంగించిన బిడెన్ బాధ్యతారాహిత్యంగా ఉన్న వారిపై తప్పకుండా చర్యలు చేపడుతానని, మీకు వివరాలు చెప్పకుండా విధుల నుంచీ తప్పిస్తానని హెచ్చరికలు చేశారు.అయితే ప్రతీ అధ్యక్షుడు భాద్యతలు చేపట్టే ముందు ఇలానే అంటాడు అనుకున్నారు అందరూ కానీ అన్నట్టుగానే న్యూయార్క్ గవర్నర్ మీద వచ్చిన విమర్శలపై ఘాటుగా స్పందించారు బిడెన్.

 Us President Joe Biden Calls Andrew Cuomo To Resign, Us President Joe Biden, New-TeluguStop.com

అగ్ర రాజ్యానికి ఆర్ధిక రాజధాని అయిన న్యూయార్క్ నగరానికి మేయర్ .ఆండ్రూ గురించి తెలియని వాళ్ళు ఉంటారా అంటే ఉండరని చెప్పాలి ఎందుకంటే ట్రంప్ హయాంలో కూడా మేయర్ గా ఉన్న ఆండ్రూ ట్రంప్ తీసుకునే ప్రతీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారు.

దాదాపు అన్ని రాష్ట్రాలు ట్రంప్ చేపట్టే నిభందనలు అమలు చేస్తే ఆండ్రూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలిచే వారు.అయితే గడిచిన కొన్ని రోజులుగా లైంఘిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆండ్రూ ను బిడెన్ హెచ్చరించారు.

రాజీనామా చేయాలని హుకుం జారీ చేశారు.

Telugu Andrewcuomo, Yorkgovernor, Joe Biden, Joebiden-Telugu NRI

ఆండ్రూ వద్ద పనిచేసిన మహిళ పట్ల ఆయన నన్ను దారుణంగా హింసించే వారని, లైంఘికంగా వేధించే వారని ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన ప్యానల్ అందుకు సంభందించిన కీలక ఆధారాలు సేకరించింది.ఈ ఆధారాలను చూసి షాక్ అయ్యింది విచారణ ప్యానల్ ఎందుకంటే దాదాపు 11 మంది మహిళలపై ఆండ్రూ లైంఘిక దాడులు చేశాడని తేలింది.సాక్ష్యాధారాలతో సహా ఆండ్రూ రాసలీలలు బయటకు రావడంతో పాటు బిడెన్ ఒత్తిడి కారణంగా ఆండ్రూ రాజీనామా చేయక తప్పలేదు.

తాజాగా తాను రాజీనామా చేస్తున్నట్టుగా ఆండ్రూ ప్రకటించారు.ఈ విషయంలో తాను విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube