అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ని ఓడించడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది ప్రతిపక్ష పార్టీ.ట్రంప్ పై ప్రజలలో వ్యతిరేకత తీసుకురావడానికి వారు ప్రధానంగా కరోన అంశాన్ని బూతద్దంలో చూపిస్తున్నారు.
ఈ పరిస్థితుల నుండీ గట్టెక్కేందుకు ట్రంప్ కరోనా వ్యాక్సిన్ ని ఎన్నికలు ముందే తీసుకురావాలని ప్రయత్నాలు చేయడమే కాదు అందులో సక్సస్ అయ్యారు కూడా.అతి త్వరలో ఈ వ్యాక్సిన్ అమెరికాలోని పలు రాష్ట్రాలకు అందుబాటులో ఉందని స్థానిక ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా ప్రజలకి వ్యాక్సిన్ అందించాలని ట్రంప్ తెలిపారు.
అయితే
ట్రంప్ ప్రభుత్వం వ్యాక్సిన్ ఆమోదించి పంపితే మేము దానిని వెంటనే అమలు చేయమని, మేము కూడా ఆ వ్యాక్సిన్ పై రివ్యూ చేసుకున్న తరువాత మాత్రమే వ్యాక్సిన్ వాడుతామని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు.ట్రంప్ ప్రభుత్వ అభిప్రాయాలను మా అభిప్రాయాలుగా మేము పరిగణలోకి తీసుకోమని,మాకు ఆ వ్యాక్సిన్ పై నమ్మకం లేదని, సురక్షితమా కాదా అనేది మేము నిర్ణయించుకుంటామని ఆయన ప్రకటించారు.
ఇదిలాఉంటే
ఆండ్రూ కి ట్రంప్ నిర్ణయాలు వ్యతిరేకించడం కొత్తేమీ కాదు.కరోనా సమయంలో లాక్ డౌన్ ఎత్తివేయమని ట్రంప్ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయగా న్యూయార్క్ గవర్నర్ మాత్రం అందుకు అంగీకారం తెలుపలేదు.
ట్రంప్ చెప్తే చేయాలా అన్నట్టుగా ఆండ్రూ వ్యవహరించిన తీరు అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.ఇలా ట్రంప్ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలుస్తున్న ఆండ్రూ తాజాగా వ్యాక్సిన్ పై నమ్మకం లేదంటూ ప్రకటించడం సంచలనం సృష్టించింది.
అయితే ఈ వ్యాక్సిన్ ని మెజారిటీ ప్రజలు తీసుకోవడానికి నిరకరిస్తున్నట్టుగా పలు సర్వేలు సైతం వెల్లడించడంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయోనని అందోళన వ్యక్తం చేస్తోంది ట్రంప్ ప్రభుత్వం.
.