న్యూయార్క్‌పై కాస్త దయచూపిన కరోనా: పడిపోయిన మరణాల సంఖ్య  

New York Corona Deaths Andrew Cuomo - Telugu Andrew Cuomo, Corona Virus, Lockdown, Lowest Level Since March, New York, New York\\'s Daily Coronavirus Death Count Falls Below 100

అమెరికాలో కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా పడింది న్యూయార్క్‌పైనే.వైరస్‌తో అతలాకుతలమైన ఇటలీ, స్పెయిన్‌లతో సమానంగా ఆ రాష్ట్రంలోనే కేసులు నమోదయ్యాయి.

 New York Corona Deaths Andrew Cuomo

మరణాల సంఖ్యలోనూ అదే పరిస్ధితి.అమెరికాలో నమోదైన మొత్తం మరణాల్లో ఆ రాష్ట్రంలోనే సగం ఉన్నాయి.

లాక్‌డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.వైరస్ తీవ్రంగా ఉన్న ఏప్రిల్ నెలలో రోజుకు వేలమంది కోవిడ్ 19తో ఆసుపత్రిలో చేరడంతో పాటు సగటున 1,000 మంది ప్రాణాలు కోల్పోయారు.

న్యూయార్క్‌పై కాస్త దయచూపిన కరోనా: పడిపోయిన మరణాల సంఖ్య-Telugu NRI-Telugu Tollywood Photo Image

దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఇలాంటి పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పౌరులకు శుభవార్త చెప్పింది.

గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 84 మంది మాత్రమే మరణించినట్లు న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు.ఇది ఒక్కరోజులో నమోదైన మరణాల సంఖ్యలో అత్యల్పమని ఆయన చెప్పారు.

శనివారం మీడియా ముందుకు వచ్చిన గవర్నర్ హాస్పిటల్‌లో చేరేవారి సంఖ్యతో పాటు కొత్తగా ఇన్ఫెక్షన్లు కూడా క్షీణించాయని ప్రకటించారు.

ఇది సంబరపడాల్సిన విషయం కాదని.మరణించిన 84 మంది కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతమన్న ఆండ్యూ క్యూమో, వైరస్ కట్టడిలో మాత్రం మంచి పురోగతిగా చెప్పారు.కాగా న్యూయార్క్ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించారు.

అయితే వైరస్‌కు కేంద్ర స్థానంగా ఉన్న న్యూయార్క్ నగరంలో మాత్రం ఆర్ధిక కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదు.అయితే ఏదైనా చట్టబద్ధమైన కార్యక్రమం కోసం బహిరంగంగా పదిమంది వరకు అనుమతిస్తున్నట్లు క్యూమో ప్రకటించారు.

కాగా అమెరికాలో ఇప్పటి వరకు16,66,828 మందికి కరోనా సోకగా, 98,683 మంది ప్రాణాలను కోల్పోయారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test