అమెరికా: తప్పనిసరి టీకా నిబంధన.. మేయర్ ఆదేశంపై కోర్టుకెక్కిన న్యూయార్క్ పోలీసులు

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వైరస్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు ఆర్ధిక వ్యవస్ధ ఛిన్నాభిన్నమైంది.

 New York City Police Union Files Lawsuit To Block Vaccine Mandate , Amerca, New-TeluguStop.com

లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోగా.అపర కుబేరుల సంపద సైతం గంటల్లో ఆవిరైంది.

వైరస్ తగ్గుముఖం పట్టిందని భావించేలోపు కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి మరింత బలం పుంజుకుని కొరడా ఝళిపిస్తోంది.రానున్న రోజుల్లో ఇది మరింత బలపడినా.

ప్రజలను రక్షించుకోవాలంటే వున్న ఒకే ఒక్క ఆయుధం వ్యాక్సినేషన్.ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా మరణాల శాతాన్ని తగ్గించవచ్చని నిపుణులు సిఫారసు చేస్తున్నారు.కొందరు ప్రజలు స్వచ్ఛందంగా టీకాలు వేసుకుంటుంటే.

కొన్నిచోట్ల మాత్రం ససేమిరా అంటుండటంతో ప్రభుత్వం సైతం కఠినంగానే వ్యవహరిస్తోంది.ఈ నిర్బంధ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొన్ని చోట్ల ఆందోళనలకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లాసియో బుధవారం సంచలన ఆదేశాలు జారీ చేశారు.నగరంలోని పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ కార్మికులు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందేనని హుకుం జారీ చేశారు.

ఈ ఆదేశాలను అతిక్రమించిన వారిని వేతనం లేని సెలవులో పంపుతామని మేయర్ హెచ్చరించారు.అయితే ఈ నిర్ణయంపై న్యూయార్క్ పోలీస్ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే మేయర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.న్యూయార్క్ నగరానికి చెందిన పోలీస్ బెనివలెంట్ అసోసియేషన్‌ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా కోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది.

మేయర్ ఆదేశాలు ఎలా అమలు చేయబడతాయన్న దానిపై వ్రాతపూర్వకంగా కానీ, ఎన్‌వైపీడీ పాలసీ కానీ లేదని అసోసియేషన్ వెల్లడించింది.

Telugu Amerca, De Blasio, York, Yorklawsuit, Nypd Policy, Patrick Lynch-Telugu N

కాగా.ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌కు సంబంధించి వచ్చే శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు మేయర్ బిల్ డి బ్లాసియో గడువు విధించారు.అప్పటిలోగా ఉద్యోగులు తాము టీకాలు వేయించుకున్నట్లు రుజువులు చూపించాలి.1,60,000 మంది వున్న న్యూయార్క్ నగర ప్రభుత్వ ఉద్యోగులలో ఇప్పటికే కనీసం 70 శాతం మంది ఒక డోసు టీకానైనా వేయించుకున్నారు.న్యూయార్క్ నగరంలోని దాదాపు 50 వేల మంది యాక్టివ్, రిటైర్డ్ పోలీసు అధికారులకు ప్రాతినిథ్యం వహిస్తున్న పోలీస్ బెనివలెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు పాట్రిక్ లించ్ మాట్లాడుతూ.

టీకా తీసుకోవాలా వద్దా అన్న అవకాశం వారికి ఉండాలని స్పష్టం చేశారు.అయితే టీకాను తీసుకోవడం వల్ల రెగ్యులర్‌గా టెస్ట్‌లు చేసుకోవాల్సిన అవసరం వుండదని మేయర్ చెప్పారు.

ఇప్పటికే నగరంలో కొన్ని మినహాయింపులను ఇచ్చినట్లు బిల్ డి బ్లాసియో గుర్తుచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube