బిగ్ బ్రేకింగ్ – అమెరికాలో మళ్ళీ పేలిన తూటా

అమెరికాలో గన్ కల్చర్ మరో సారి బయట పడింది.అమెరికా వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట తూటాలకి ఎంతో మంది బలై పోతున్నారు.

 New York Brooklyn Shooting Four Dead-TeluguStop.com

ఎన్ని దారుణాలు, మారణహోమాలు జరిగినా సరే ఇప్పటికీ కూడా గన్ కల్చర్ అదుపు చేయలేక పోతోంది ప్రభుత్వం.సరిగ్గా కొన్ని రోజుల క్రితమే అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కాల్పులు జరుగగా మళ్ళీ ఈరోజు అమెరికాలో ఓ ఉన్మాది విచక్షణా రహిత కాల్పుల వలన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

భారత కాలమానం ప్రకారం ఈరోజు అనగా శనివారం సాయత్రం 7 గంటల ప్రాంతంలో ఓ ఉన్మాది బ్రూక్లిన్ లోని ఎవెన్యూ ప్రాంతంలో కాల్పులు జరుపగా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ముగ్గురికి తీవ్ర గాయాలపాలయ్యారు.

ఈ ఘటన జరిగిన వెంటనే నిందితులు పారిపోయారని పోలీసులు తెలిపారు.రక్షణ కోసం ఇచ్చిన తుపాకులు ఇలాంటి చెడు పనులకి వాడుతున్నారు అంటూ మండిపడుతున్నారు అమెరికన్స్.

Telugu Utica, Brooklyn, York-

 

ఇదిలాఉంటే గత కొంత కాలంగా తుపాకీ నియంత్రణ చట్టం అమలు చేయాలని స్వచ్చంద సంస్థలు, డెమోక్రటిక్ పార్టీ నేతలు సభలో గగ్గోలు పెడుతున్నా సరే ఇప్పటికి కూడా ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరైనది కాదని ఈ విధానం వలన ఇప్పటికే ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని అంటున్నారు అమెరికా పౌరులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube