ఆహ్లాదకరమైన నర్సరీల్లో నూతన సంవత్సర సందడి...

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం రూరల్: ఆహ్లాదకరమైన నర్సరీల్లో నూతన సంవత్సర సందడి నెలకొంది. కడియం పల్ల వెంకన్న, శ్రీ సత్యదేవా నర్సరీల్లో వేలాది మొక్కలతో అందమైన ఆకృతులను తీర్చిదిద్దారు.

 New Year Celebrations In Kadiyam And Sri Satyadeva Nurseries Details, New Year C-TeluguStop.com

జై కిసాన్, జై జవాన్, దేశానికి రైతే రాజు అంటూ పలు సందేశాలతో మొక్కలను కొలువుతీర్చారు.సత్యదేవా నర్సరీ లో భారత ముఖ చిత్రం వేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెల్పుతూ ఒక ఆకృతి హలం పట్టిన రైతును మొక్కలతో చిత్రీకరిస్తు మరో ఆకృతిని ప్రదర్షించారు.

వ్యవసాయ రంగం పై ఆంక్షలు విధిస్తూ కేంద్రప్రభుత్వం చేసిన చట్టాలను ఉపసంహరించుకోవడం శుభపరిణామం అని కడియం నర్సరీమేన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు పుల్లా ఆంజనేయులు అన్నారు.పల్ల వెంకన్న నర్సరీ లో కూడా రెండు విభిన్న ఆకృతులను మొక్కలతో అలంకరించారు.

ఆల్ట్రానేంత్రా గ్రీన్, ఎల్లో, పింక్,మెండో గ్రాస్, అర్చిపోలియో బ్లాక్, కొలియాస్ రకాలు, సాల్వియా వంటి వేలాది జాతి మొక్కలతో సృజనాత్మకమైన ఆకృతులను తీర్చిదిద్దారు.

హలం ఓ వైపు ,తుపాకీ ఓ వైపు నింపి జై జవాన్, జై కిసాన్ అక్షర వర్ణవ్యవిద్యాన్ని కాన్వాస్ పై ఉంచారు.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడియం నర్సరీ లో నెలకొన్న ఈ ఆకృతులు నర్సరీ రైతుల్లోని దేశభక్తిని, సామాజిక హితాన్ని చాటింది.కనుల పండుగగా కనిపిస్తున్న ఈ మొక్కల చిత్రాల వద్ద ఫోటోలు తీయించుకోవడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు.

కడియపులంక జాతీయ రహదారిపై ప్రక్కన పుల్లా చిన సత్యనారాయణ పూల అలంకరణలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube