సురేందర్ రెడ్డి( Director Surender Reddy ) దర్శకత్వంలో అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) హీరోగా నటించిన చిత్రం ఏజెంట్.( Agent Movie ) భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించిన విషయం తెలిసిందే.ఇందులో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.
కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది.

ఈ సినిమాకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టిన అఖిల్ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ బాధను మర్చిపోవడానికి సోలోగా వెకేషన్ కు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటున్నాడు అఖిల్.అయితే ఇటీవలే ఈ సినిమా ఫ్లాప్ పైకి స్పందించిన అఖిల్ మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రేక్షకుల ముందుకు వస్తాను అని హామీ ఇచ్చాడు.ఇది ఇలా ఉంటే ఏజెంట్ సినిమా ఓటీటీ విడుదల పై ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.
కాగా ఈ సినిమా మే ఆఖరిలో ఓటీటీలో విడుదల చేస్తాం అని మూవీ మేకర్స్ ముందుగానే ప్రకటించినప్పటికీ సినిమా విడుదల కాస్త ఆలస్యం అయ్యింది.

దానికి కారణం ఏంటా అని ఆరా తీయగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాకి తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది.దగ్గరుండి సినిమాను మరోసారి ఎడిట్ చేయిస్తున్నారట.థియేట్రికల్ రిలీజ్ టైమ్‌లో తొలగించిన సీన్లను జోడిస్తున్నాడని సమాచారం.
ఈ మేరకు ఏజెంట్ స్క్రీన్‌ప్లేలో కూడా మార్పులు ఉంటాయని న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అయితే, ఓటీటీ వెర్షన్ కోసం ఒక సినిమాను ప్రత్యేకంగా ఎడిట్ చేయడం ఇదే మొదటిసారి కావచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఇందుకు సంబందించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వార్త పై స్పందించిన పలువురు నెటిజన్స్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై మండిపడుతున్నారు.ఆల్రెడీ ఘోరమైన డిజాస్టర్ ని చవి చూసిన సినిమాకు ఇంకా మెరుగులు దిద్దడం ఏంటి పిచ్చి కాకపోతే అంటూ మండిపడుతున్నారు.
