భారత్ కు తోడుగా ఉంటాం..మా బంధం ఎంతో గొప్పది..!!!

అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన శుభ సమయంలో భారత్ కు అమెరికా తోడుగా ఉంటుంది.మా ఇరు దేశాల మధ్య భంధం ఎంతో గొప్పది అంటూ అమెరికా ప్రభుత్వంలోని కీలక నేత వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

 New Us Govt May Look To Further Deepen Ties With India Says Blinken, Us Secretar-TeluguStop.com

మరి కొన్ని నిమిషాలలో ప్రమాణ స్వీకారం జరనున్న సమయంలో అమెరికా విదేశాంగ మంత్రిగా నియమితులైన ఆంటోని బ్లింకెన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంభంధాలను మరింత బలోపేతం చేసేవిగా మారాయి.వివరాలలోకి వెళ్తే.

బిడెన్ ఏరికోరి విదేశాంగ శాఖా మంత్రిగా ఆంటోని బ్లింకెన్ ను నియమించారు.ప్రమాణ స్వీకారం జరగనున్న సమయంలో బ్లింకెన్ మాట్లాడుతూ భారత్ పై ప్రశంసలు కురిపించారు.ఏ పార్టీ అధికారంలో ఉంది అనే విషయం పక్కన పెడితే భారత్, అమెరికాల మధ్య భందాలు ఎన్నో ఏళ్ళుగా మంచి స్నేహాన్ని కలిగించాయని అన్నారు.ఈ విషయంలో భారత్ చాలా గొప్ప దేశమని అన్నారు బ్లింకెన్.

భవిష్యత్తు లో బిడెన్ నాయకత్వంలో కూడా ఇరు దేశాల మధ్య ఇలాంటి సంభంధాలు ఉంటాయని, ఇంతకంటే మెరుగైన సంభంధాలు అమెరికా కొనసాగితుందని ప్రకటించారు.

Telugu America, Antony Blinken, Joe Biden, Deepenindia-Telugu NRI

ఒబామా సమయంలో రెండు దేశాల మధ్య మంచి సంభంధాలు ఉన్నాయని, ట్రంప్ సైతం అదే బాణి కొనసాగించారని గుర్తు చేశారు.భారత్ పై చైనా తో సహా ఏ దేశం కూడా దుందుడుకు చర్యలు తీసుకోకుండా కృషి చేస్తున్నామని అన్నారు.భారత్ పై ఇతర దేశాల ఆగడాలు చూస్తున్నామని సరైన సమయంలో అన్ని విషయాలపై మా స్పందన ఉంటుందని తెలిపారు.

ఉగ్రవాద నిర్మూలనలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని, వాతావరణ మార్పు అంశాలపై ఇంకా మరింత పురోగతి సాధించాల్సి ఉంటుందని అన్నారు.భారత్ కు భవిష్యత్తులో అమెరికా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్దంగా ఉంటుందని చెప్పకనే చెప్పారు బ్లింకెన్.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube