బిగ్ బాస్ అభిమానులకు న్యూ అప్డేట్..!

బుల్లితెరలో ప్రసారమయిన బిగ్ బాస్ షో కి ప్రేక్షకుల నుంచి ఎంత ఆదరణ వచ్చిందో మాటల్లో చెప్పలేము.వరసగా నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకుందంటే ఆ బిగ్ బాస్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అర్ధం అవుతుంది.

 New Update For Bigg Boss Fans Bigg Boss, Bb5, Social Media, Viral Latest, Vira-TeluguStop.com

అసలు బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అవుతుందో లేదో అని అందరిలో అప్పట్లో ఒక ప్రశ్న మెదిలింది.ఎందుకంటే నాల్గవ సీజన్ సమయంలో అప్పుడు కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది.

కానీ, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ 4 విజయవంతంగా ప్రదర్శించబడింది.మొదట్లో బిగ్ బాస్ సీజన్ 4 పై కొన్ని విమర్శలు వచ్చినాగాని చివరి ఐదు వారాలు మాత్రం ఆద్యంతం ప్రేక్షకులను భారీగా టీఆర్పీ రేటింగ్ లు తెచ్చి పెట్టాయి.

ఇప్పుడు మళ్ళీ ఇక బిగ్ బాస్ షో సీజన్ 5 ను కూడా ఈ ఏడాదిలోనే ప్రసారం చేయాలనీ షో నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

Telugu Bigg Boss, Latest-Latest News - Telugu

అయితే ఈ సీజన్ జూన్ లేదా జులై నెల నుంచి ప్రారంభం కానుందని వినికిడి.అన్ని నెలలు గ్యాప్ ఎందుకనే ప్రశ్న మీకు రావచ్చు.దానికి కారణం లేకపోలేదు.

ఈ సమ్మర్ లో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి.కావున అదే సమయంలో బిగ్ బాస్ షో ప్రసారం అయితే షో టీఆర్పీ రేటింగ్ లు తగ్గే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

అందుకనే ఈ సీజన్ ఆలస్యంగా ప్రారంభం అవుతుందని బిగ్ బాస్ ఫ్యాన్స్ కొంచెం విచారంలో ఉన్నారు.

అలాగే ఈ సీజన్ లో సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలనే ఎక్కువగా తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది.

ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలు తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తారని, అలాగే వాళ్ళ పాపులారిటీ కూడా బిగ్ బాస్ కి ప్లస్ అవుతుందని బిగ్ బాస్ నిర్వాహకుల అంచనా.ఇకపోతే హోస్ట్ విషయానికి వస్తే ఈసారి కూడా మన కింగ్ నాగార్జున గారే బిగ్ బాస్ సీజన్ 5 కి హోస్ట్ గా ఉంటారని వినికిడి.

అలగే సీజన్ 100 రోజులు పాటు ప్రసారం చేయాలని భావిస్తు న్నారట.ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్లను ఫైనలైజ్ చేసినట్లు కూడా టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube