దేశంలో వివిధ కారణాలతో జరుగుతున్న హత్యల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయట.మనుషుల్లో నేర ప్రవృత్తి విపరీతంగా పెరుగుతున్న క్రమంలో, ఒక మనిషిని చిత్ర హింసలకు గురిచేయడంలో, హత్య చేయడంలో నేరగాళ్లూ కొత్త పద్దతులను ఆచరిస్తున్నారని వెల్లడవుతుంది.
తాజాగా జరుగుతున్న కొన్ని ఘటనలే ఇందుకు సాక్ష్యం.అదేమంటే నిద్రపోతున్న భార్యపై ఓ భర్త రాక్షసంగా ప్రవర్తించాడు.విచక్షణ రహితంగా దాడి చేసి ఆమె చేతి వేళ్లను గొడ్డలితో నరికి వేసిన ఘటన గురించి తెలిసిందే.
అయితే ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకోవడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కాగా గడిచిన 15 రోజుల్లో ఇలాంటి ఘటనలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3 జరిగాయట.ఈ నేపధ్యంలో ఇలాంటి ఉదంతాలు రాష్ట్ర ప్రజలను టెన్షన్ పెట్టిస్తున్నాయని వెల్లడించారు.ఈమేరకు దారుణాలను నివారించడానికి నేరాలు చేసే వారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని పేర్కొన్నారు.