ప్రయోగమా..పిచ్చా...వందలకోట్ల దోమలు వదులుతున్న అమెరికా ప్రభుత్వం...!!!

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే సామెత వినే ఉంటారు.ఈ సామెత అచ్చు గుద్దినట్టుగా అమెరికాకు సెట్ అవుతుంది.

 Zika Virus Come To America, America, Zika Virus, New Type Mosquitoes-TeluguStop.com

ఏదో ఒక ప్రయోగంలో నిత్యం తలమునకలై పోయే అమెరికా యంత్రాంగం.తాజాగా ఓ సరికొత్త ప్రయోగానికి తెరతీసింది.

అమెరికాలో ఓ భయంకరమైన వైరస్ ను కలిగించే దోమలను చంపేందుకు సృష్టికి ప్రతి సృష్టిలా దోమలకు ప్రతిగా కొత్త రకం దోమలు కనిపెట్టి వాటిపై ఒదలనుందట.ఈ విషయం తెలుసుకున్న అమెరికన్స్ ప్రభుత్వం పై మండిపడుతున్నారు.

ఇది ప్రయోగమా పిచ్చా అంటూ నిరసనలకు దిగుతున్నారు.వివరాలలోకి వెళ్తే.


అమెరికాలో జికా వంటి వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం అక్కడ ఉండే ఎయిడిస్ జాతి దోమలు.ఈ దోమలు అమెరికాలో ఎక్కువగా ఉంటాయట.

ఈ వైరస్ బారిన పడిన వారికి జ్వరం రావడం, తలనెప్పిగా ఉండటం, దురదలు రావడం, అలాగే ఒళ్ళు నెప్పులు వచ్చి కళ్ళు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.ఈ వైరస్ డెంగ్యూ వైరస్ కు దగ్గర పోలికలు ఉంటాయి.

అయితే ఈ వైరస్ అమెరికన్స్ పై తీవ్ర ప్రభావం చూపడంతో ఎన్నో పరిశోధనలు చేసిన తరువాత నిపుణులు ఓ నిర్ణయానికి వచ్చారు.

జికా వైరస్ కలిగించే దోమలను అంతం చేయడానికి ఫ్లోరిడా కీస్ దోమాల కంట్రోల్ డిస్ట్రిక్ట్ అలాగే బ్రిటన్ కు చెందినా మరొక కంపెనీ కలిసి కొత్త ప్రయోగం చేయాలని భావించాయి జన్యు పరంగా అబ్గివ్రుద్ది చేసిన ఎయిగిన్ ఎజిప్ట్ దోమలను ఫ్లోరిడాలో విడుదల చేయాలని భావించారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు ప్రదర్శిస్తున్నారు.అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఆడ దోమలను నిర్మూలించాలంటే తప్పనిసరిగా క్లోనింగ్ చేసిన మగ దోమలను విడుదల చేయాలని వీటి ద్వారా పుట్టే పిల్లలకు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉందట.

దాంతో ఈ దోమలు సంఖ్య తగ్గిపోతుందని ప్రజలు సహకరించాలని కోరుతున్నారు అధికారులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube