విశాల్‌ పెళ్లి క్యాన్సిల్‌ వార్తల్లో ట్విస్ట్‌

తమిళ హీరో విశాల్‌ వివాహ నిశ్చితార్థం కొన్ని నెలల క్రితం అయిన విషయం తెల్సిందే.వీరిద్దరి పెళ్లి త్వరలో అంగరంగ వైభవంగా జరుగబోతుందని అంతా భావిస్తున్నారు.

 New Twistinactor Vishalmarriage-TeluguStop.com

హైదరాబాదీ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న విశాల్‌ పెళ్లి కబురు ఎప్పుడు చెప్తాడా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గత రెండు మూడు రోజులుగా విశాల్‌ పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది అంటూ ప్రచారం జరుగుతోంది.అమ్మాయి అనీష కొన్ని కారణాల వల్ల విశాల్‌తో పెళ్లికి తిరష్కరించిందని కొందరు.

ఇద్దరి మద్య బ్రేకప్‌ అయ్యిందని, అందుకే పెళ్లి వద్దనుకుంటున్నారని కొందరు ఇష్టానుసారంగా ప్రచారం చేశారు.

Telugu Anisha, Vishal, Twist Vishal-

విశాల్‌ పెళ్లి క్యాన్సిల్‌ అయినట్లే అంటూ అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా అనీష స్వయంగా పెళ్లి విషయమై ఇండైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చింది.విశాల్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆమె బర్త్‌డే విషెష్‌ వారిద్దరు బ్రేక్‌ అవ్వలేదని చెప్పకనే చెబుతోంది.నీ జీవితాంతం నీతో నేను ఉండాలని కోరుకుంటున్నాను, మనిద్దరి జర్నీ హ్యాపీగా సాగాలని ఆశిస్తున్నాను.

ఈ సందర్బంగా హ్యాపీబర్త్‌డే నీకు అంటూ అనీష సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

అనీష పోస్ట్‌తో విశాల్‌ పెళ్లి క్యాన్సిల్‌ అయ్యిందనే వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది.

అయితే ఎప్పుడు వీరిద్దరి పెళ్లి జరుగుతుందనే విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం విశాల్‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

అదే విధంగా ఆమద్య జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.ఇలాంటి సమయంలో పెళ్లి కోసం ఆయన హడావుడి పడటం లేదు.

మెల్లగానే చేసుకుందాం అన్నట్లుగా అతడు ఉన్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube