సైబర్ నేరగాళ్ల కొత్త పంథా.. లబోదిబోమంటున్న బాధితుడు!

టెక్నాలజీ రంగం ఎప్పటికప్పుడు మారిపోతున్న తరుణంలో సైబర్ మోసగాళ్లు కూడా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో గాలాలు వేస్తున్నారు.ఇంకేముంది కట్ చేస్తే, లక్షల్లో డబ్బు దోచుకుంటున్నారు.ఇదే తరహాలో కేరళకు చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి తాజాగా ఓ రూ.20వేలు నొక్కేశారు.అతడికి అసలు పేటీఎం అకౌంట్ లేకపోయినా, ఆ పేరుతో డబ్బు కొట్టేయడం ఇక్కడ మిక్కిలి విశేషం.దాంతో రూ.20వేలు పోగొట్టుకున్న వ్యక్తి, తనకు న్యాయం చేయాలంటూ బ్యాంకు, పోలీస్ స్టేషన్​ చుట్టూ తిరుగుతున్నాడు.ఇలాంటి కేసును ఎప్పుడూ చూడని బ్యాంకు సిబ్బంది, పోలీసులు.

 New Trend Of Cyber Criminals Labodibomantunna Victim , Cyber Security, Cyber Cr-TeluguStop.com

ఏం చేయాలా? అని ఇపుడు తలపట్టుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే, అనీస్​ రహ్మాన్ అనే బాధితుడు కేరళ, మలప్పురం జిల్లాకి చెందిన వండూర్ వాసి.

బ్యాంకు ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకున్న అతడికి ఊహించని షాక్ తగిలింది.దాదాపు రూ.20వేల రూపాయలు విత్​డ్రా అయినట్లు గమనించాడు.వెంటనే బ్యాంకుకు వెళ్లి.

ఏం జరిగిందని ఆరా తీయగా, 3 సందర్భాల్లో పేటీఎం ద్వారా డబ్బు డ్రా చేసినట్లు రికార్డుల్లో నమోదు అయిందని సదరు బ్యాంకు సిబ్బంది తెలిపారు.అసలు తనకు పేటీఎం అకౌంట్ లేదు బాబోయ్ అని అనీస్ చెప్పాడు.

ఇది సైబర్ మోసగాళ్ల పని అయి ఉంటుందని ఫిర్యాదు చేశాడు.కాగా ఇలాంటి కేసు రావడం తమకు తొలిసారని బ్యాంకు అధికారులు ఈ సందర్బముగా చెప్పడం గమనార్హం.

ఇకపోతే, ఈ వ్యవహారం మోసపూరితంగా కనిపిస్తున్నందున.సైబర్ నేరగాళ్ల పని అయి ఉంటుందన్న అనుమానంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితుడికి డబ్బులు పోవని, అవసరమైతే బ్యాంకువారు తిరిగి చెల్లించడానికి సిద్ధంగా వున్నారని చెప్పడంతో అనీష్ కాస్త ఊరట చెందాడు.సైబర్ నేరగాళ్లు పక్కా ప్రణాళికతో ఇలా చేసి ఉంటారని వారు భావిస్తున్నారు.తొలుత ఒక్క రూపాయి మాత్రమే బదిలీ చేసి, ఆ తర్వాత రూ.9999, మూడోసారి రూ.8635 ట్రాన్స్​ఫర్​ చేసినట్టుగా ఉన్న స్టేట్​మెంట్ సహా ఇతర అంశాల ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube