ఇక ప్రస్తుతం తెలుగులో చాలా మంది కొత్త దర్శకులు కొత్త పంథాను ఎంచుకొని సినిమాలు చేస్తున్నటుగా తెలుస్తుంది.ముఖ్యంగా కొంతమంది భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తుంటే మరి కొంతమంది కొత్త దర్శకులు మాత్రం చాలా కొత్తగా ఆలోచిస్తూ యంగ్ హీరోలతో సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు.
అందులో ముఖ్యంగా అనుదీప్ డైరెక్షన్ లో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లు హీరోలుగా పెట్టీ చేసిన ‘జాతి రత్నాలు ‘ సినిమా( Jathi Ratnalu Movie ) సూపర్ డూపర్ సక్సెస్ ను అందుకుంది.

ఇక అప్పటి నుంచి అదే పాటర్న్ లో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.ముఖ్యంగా ముగ్గురు హీరోలను పెట్టి సినిమాను చేయడం అనేది ఇప్పుడు ఒక ట్రెండ్ గా మారిపోయింది.కొన్ని సిరీస్ లను కూడా ఇప్పుడు అలాగే చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నారు.
రీసెంట్ గా వచ్చిన ‘సేవ్ ది టైగర్ సెకండ్ సీజన్’( Save The Tigers Second Season ) కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.మొదటి సీజన్లో మంచి మార్కులు కొట్టేసిన ఈ సిరీస్.ఇప్పుడు కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది…

ఇలా వచ్చిన ప్రతి సినిమా , సిరీస్ లు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నాయనే చెప్పాలి.అందుకే చాలా మంది డైరెక్టర్లు ముగ్గురు హీరోలతో కూడిన ఒక స్టోరీని రెడీ చేసుకొని సినిమాగా చేసి మంచి విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఇప్పుడు కూడా అలాంటి సినిమాలు చాలానే వస్తున్నాయి.ముఖ్యంగా శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామ కృష్ణ ముగ్గురు లీడ్ రోల్ చేస్తున్న ‘ఓం భీమ్ బుష్ ‘ సినిమా( OM Bheem Bush Movie ) ప్రేక్షకుల ముందుకు వస్తుంది.మరి ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే ఇక మీదట ఇలాంటి సినిమాలు వస్తాయి.లేకపోతే మాత్రం మళ్ళీ కొత్త పంథాలో సినిమాలో చేయాల్సి వస్తుంది…
.