భారతీయుల ఎంట్రీ పై బ్రిటన్ కొత్త రూల్స్...!!!

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన అలజడి అంతాఇంతా కాదు.ఊహించని విధంగా అన్ని దేశాలకు తీవ్ర ఆర్ధిక, ప్రాణ నష్టం మిగిల్చింది.

 New Travel Rules In Uk From October 11, Britain, Travel Rules, Indians, 10day Qu-TeluguStop.com

ఈ కారణంగా ఉపాది లేక, ప్రాణ భయంతో దాదాపు అన్ని దేశాలలో ఉన్న వలస వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సొంత దేశాలకు వెళ్ళిపోయారు.ఈ క్రమంలోనే వలస వాసుల ఎంట్రీ పై అన్ని దేశాలు ఆంక్షలు విధించాయి.

దాంతో కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కూడా వలస వాసులు ఆయా దేశాలకు వెళ్ళలేని పరిస్థితి ఎదురయ్యింది.ముఖ్యంగా భారత్ పై పలు దేశాలు ఇప్పటికీ ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నాయి.తాజాగా

బ్రిటన్ భారత్ పై ఆంక్షలు ఎత్తివేసిన నేపధ్యంలో పలు నిభందనలు విధిస్తూ భారతీయులకు ఆహ్వానం పలుకుతోంది.అమెరికా లాంటి అగ్ర రాజ్యం భారతీయులకు ఆహ్వానం పలికిన నేపధ్యంలో బ్రిటన్ పై భారత్ నుంచీ తీవ్ర ఒత్తిడుల నేపధ్యంలో బ్రిటన్ ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది.

తాజా నిభంధనల ప్రకారం గతంలో బ్రిటన్ వెళ్లాలనుకనే వారు తప్పకుండా ఆర్టీ పీసిఆర్ టెస్ట్ చేయించుకుని కరోనా సోకలేదని నిర్ధారించుకున్న తరువాత ప్రయాణం చేయాలి కానీ తాజాగా నిభంధనల ప్రకారం బ్రిటన్ కు వెళ్ళిన రెండవ రోజు కరోనా టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది కానీ ఈ నిభందన కేవలం కోవిషీల్డ్ చేయించుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.అయితే

కోవీషీల్డ్ కాకుండా ఇతర వ్యాక్సిన్ లు తీసుకున్న వారు మాత్రం విమానం ఎక్కే ముందు తప్పనిసరిగా “ఆర్టీ పీసిఆర్” టెస్ట్ చేయించుకుని అందులో నెగిటివ్ వచ్చిన తరువాత మాత్రమే బ్రిటన్ రావాలి.

అంతేకాదు బ్రిటన్ వెళ్ళిన తరువాత సుమారు 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి, అలాగే 2 వ రోజు, 8వ రోజు న కుడా కరోనా టెస్ట్ చేయించుకోవాలి ఇందులో నెగిటివ్ వచ్చిన వారు క్వారంటైన్ నుంచీ వెళ్లి వారి వారి పనులు చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube