ఇకపై ఏటీఎం కార్డులతో మాత్రమే కాదు... వాచ్ లతో కూడా పేమెంట్ చేయొచ్చు... ఎలానో తెలుసా...?

ప్రపంచంలో రోజుకొక టెక్నాలజీ మనకు అందుబాటులోకి వస్తుంది.తాజాగా భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టైటాన్ సంస్థలకు సంబంధించి సంయుక్తంగా యోనో యాప్ ఆధారంగా పనిచేసే టైటాన్ కంపెనీకి చెందిన వాచ్ లను టైటాన్ పే వాచ్ లుగా ఆవిష్కరించాయి.

 Sbi, Titan, Watch, Pos Payments, Technology-TeluguStop.com

బయట ఎక్కడైనా పిఓఎస్ ల వద్ద డెబిట్ కార్డు స్వైపింగ్ లేకుండా కేవలం వాచ్ నుంచి చెల్లింపులు చేసే విధంగా టెక్నాలజీని రూపొందించారు.ఇందుకు సంబంధించి ఎస్ బిఐ ఓ ప్రకటనలో భాగంగా తెలియజేసింది.

అయితే ఈ టెక్నాలజీ ఉపయోగించేందుకు వినియోగదారులు కచ్చితంగా యోనో యాప్ లో నమోదు అయి ఉండాలి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక మంది యూజర్లు యోనో యాప్ ను ఉపయోగిస్తున్నారు.

ఈ కొత్త టెక్నాలజీ ద్వారా పిఓఎస్ ల వద్ద ఎలాంటి డెబిట్ కార్డ్, అలాగే పిన్ నెంబర్ టైప్ చేయడం లాంటివి లేకుండా రెండు వేల రూపాయల వరకు ఎలాంటి చెల్లింపులు అయిన చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో టైటాన్ కంపెనీకి చెందిన టైటాన్ పే వాచ్ మార్కెట్లోకి తీసుకువచ్చారు.

ఈ వాచ్ లను ఎస్బిఐ చైర్మన్, అలాగే టైటాన్ ఎండి లు సంయుక్తంగా వర్చువల్ గా విడుదల చేశారు.ఇక ఈ వాచీలు మొత్తం ఐదు వేరియంట్లలో లభించనున్నాయి.

ఇందులో మూడు మగవారికి, అలాగే రెండు రకాల మోడల్స్ ఆడవారి కోసం డిజైన్ చేశారు.ఈ టైటాన్ పే వాచ్ లు ధర రూ.2995 నుండి రూ.5995 మధ్యలో ఉన్నాయి.ఇక ఈ అప్లికేషన్ ఎలా పనిచేస్తుందంటే ముందుగా యోనో యాప్ లో రిజిస్టర్ అయిన వారికి వాచ్ స్క్రాప్ లో అమర్చిన చిప్స్ సహాయంతో కాంటాక్ట్ లెస్ చెల్లింపుల పక్రియ జరగనుంది.పిఓఎస్ మిషన్లు అందుబాటులో ఉన్న ప్రతి దగ్గర ఈ టైటాన్ పే పనిచేస్తుంది.

అయితే ఇందుకోసం ఎస్బిఐ ఖాతాదారులు యాక్టివేషన్ కొరకు తమ ఎస్బిఐ ఖాతాలో కేవైసీ వెరిఫై చేయాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube