న్యూసౌత్‌ వేల్స్‌‌లోనూ ఇక అబార్షన్లు చట్టబద్ధం: 119 ఏళ్ల నాటి చట్టం రద్దు

ఇకపై ఆస్ట్రేలియా వ్యాప్తంగా అబార్షన్లు చట్టబద్ధమయ్యాయి.ఆ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అబార్షన్లకు చట్టబద్ధత ఉన్నప్పటికీ ఒక్క న్యూ సౌత్ వేల్స్‌ మాత్రం ఇప్పటి వరకు దీనిపై చట్టం తీసుకురాలేదు.

 New South Wales Lower House Passed The Bill Overturns 119 Year Old Law New Sout-TeluguStop.com

అయితే గురువారం న్యూసౌత్ వేల్స్ చట్టసభ 119 ఏళ్ల నాటి చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లును ఆమోదించింది.

Telugu Law, Wales, Telugu Nri Ups-

ఈ చట్టంపై గత కొన్ని వారాలుగా వాడి వేడి చర్చ జరుగుతుండగా దీనిపై కన్జర్వేటివ్ ప్రభుత్వంలో సైతం భేదాభిప్రాయాలు వచ్చాయి.ఈ బిల్లును కొంతమంది ఎంపీలు, సామాజిక కార్యకర్తలు వ్యతిరేకించారు.నెలలు నిండిన సమయంలో గర్భస్రావాలు తల్లీకి, బిడ్డకి ప్రాణాపాయాన్ని కలిగిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

దీనిపై సభలో బిల్లును ప్రవేశపెట్టిన లేబర్ పార్టీ ఎంపీ పెన్నీ షార్ప్ స్పందించారు.ఇప్పుడవుతున్న చట్టం కారణంగా అబార్షన్ చేయించుకున్నందుకు మహిళకు, చేసినందుకు వైద్యుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నారని ఇది సరైన విధానం కాదన్నారు.

చివరికి రాష్ట్ర దిగువ సభ 100 సవరణలు ప్రతిపాదించి బిల్లును ఆమోదించింది.దీనికి 26 మంది ఎంపీలు మద్ధతు పలకగా 14 మంది వ్యతిరేకించారు.ఇప్పటికే ఈ బిల్లును ఎగువసభ ఆమోదించింది.ఈ కొత్త చట్టం ప్రకారం 22 వారాల వరకు గర్భంతో ఉన్న మహిళకు అబార్షన్ చేయడం నేరం కాదు, అయితే అందుకు ఇద్దరు వైద్యుల అనుమతి తప్పనిసరి.

గతంలో ఉన్న చట్టం ప్రకారం తల్లీ, బిడ్డ ప్రాణాలు సంకటంలో పడినప్పుడు మాత్రమే అబార్షన్ చేయాలి.అలా కాకుండా గర్భస్రావాలు చేస్తే పదేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube