మా కొత్త నిర్ణయాలు... నరేష్‌ ప్యానల్‌పై ప్రశంసలు  

New Sensational Decisions In Maa-maa Association,naresh,మా గోల్డ్‌ కార్డు,మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌

పలు వివాదాల మద్య మా కొత్త మండలి కొలువైన విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో శివాజీ రాజా ప్యానల్‌పై సీనియర్‌ నటుడు నరేష్‌ ప్యానల్‌ గెలుపొందిన విషయం తెల్సిందే. నరేష్‌పై చాలా మంది నమ్మకాలు పెట్టుకున్నారు..

మా కొత్త నిర్ణయాలు... నరేష్‌ ప్యానల్‌పై ప్రశంసలు-New Sensational Decisions In Maa

శివాజీ రాజా తప్పకుండా మూవీ ఆర్టిస్టుల కష్టాలను తెలుసుకుంటాడని ఆశించారు. అయితే మూవీ ఆర్టిస్టులు నరేష్‌ పై పెట్టుకున్న నమ్మకంను నిలుపుకుంటూ కొత్త నిర్ణయాలు తీసుకు వచ్చాడు. ఆయన తీసుకు వచ్చిన నిర్ణయాలను సినీ వర్గాల వారు అభినందిస్తున్నారు.

ముఖ్యంగా సభ్యత్వంకు సంబంధించిన విషయమై నరేష్‌ ప్యానల్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

నరేష్‌ ప్యానల్‌ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.

మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌కు చెందిన సభ్యులు ఎవరైనా ఏదైనా సమస్యను కలిగి ఉంటే వెంటనే వారు 9502030405 అనే నెంబర్‌కు సంప్రదించి హెల్ప్‌ పొందవచ్చు.వృద్ద మా సభ్యులు అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి నెలకు వెయ్యి చొప్పున ఆర్థిక సాయం చేసేందుకు మా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అయిదు వేల రూపాయలు పెన్షన్‌ను పొందుతున్నారు. ఆ అయిదు వేల రూపాయలతో మరో వెయ్యి అంటూ వచ్చే నెల నుండి ఆరు వేల రూపాయలు పేద కళాకారులు పొందబోతున్నారు.

ఇక మా సభ్యత్వం తీసుకోవాలంటే చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నది. లక్ష రూపాయలను మా సభ్యులు చెల్లించాల్సి ఉంటుంది. మాలో సభ్యత్వంకు లక్ష రూపాయలు ఖర్చు చేయడం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సాధ్యం అయ్యే పని కాదు.

అందుకే మా సభ్యత్వం తీసుకునేందుకు మొదట 25 వేల రూపాయలు చెల్లించి రెండు సంవత్సరాల్లో మిగిలిన 75 వేల రూపాయలు చెల్లించవచ్చు.

25 వేల రూపాయలు చెల్లించిన వారికి మా గోల్డ్‌ కార్డు వస్తుంది. వారు మా నిర్ణయాలను పాటించాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే వారు మిగిలిన 75 వేల రూపాయలు చెల్లిస్తారో అప్పుడే వారు మా నిర్ణయాలను పాటించాల్సి ఉంటుంది. మా నిబంధనలు వారికి వర్తిస్తాయి. ఇలా పలు కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల మా సభ్యులపై అభినందనలు వ్యక్తం అవుతున్నాయి.

మా సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశ్యంతో తాము పలు రకాల నిర్ణయాలు తీసుకున్నట్లుగా నరేష్‌ ప్రకటించాడు.