వాట్సాప్ లో కొత్త స్కాం - జాగ్రత్త

ఎక్కడలేని వింతలు, అసలు సాధ్యపడని విషయాలు .అన్ని వాట్సాప్ మెసేజెస్ లో చూడవచ్చు, ఎదో ఒక దేవుడి గురించి మెసేజ్ పెట్టి, దీన్ని 14 మందికి పంపకపోతే చెడు వార్త వింటారని అంటారు.

 New Scam In Whatsapp In The Name Of Airtel And Bsnl-TeluguStop.com

మరో మెసేజ్ ని ఫార్వార్డ్ చేయకపోతే వాట్సాప్ అకౌంట్ డిలీట్ అయిపోతుందని అంటారు.మొన్నామధ్య వాట్సాప్ విడియో కాలింగ్ ఆప్షన్ కోసం ఎదో నకిలీ వెబ్ సైట్ లో రిజిస్టర్ కావాలని అన్నారు.

అంతా ఉత్తదే.బకరా అయ్యే మనుషులు ఉన్నంతకాలం ఇలాంటి స్కామ్స్ చేస్తూనే ఉంటారు హ్యాకర్లు.

ఇప్పుడు మరో స్కాం మొదలైంది.జియో తన ఆఫర్ ని పొడిగించడంతో, ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్ కూడా ఉచిత 4G, ఉచిత వాయిస్ కాల్స్ ఆఫర్స్ ఇస్తున్నాయని, ఆ ఆఫర్ ని పొందాలంటే ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయాలని, మీ స్నేహితులకి ఈ మెసేజ్ పంపాలనేది ఈ కొత్త స్కాంలో ఉన్న కంటెంట్.

బాధాకరమైన విషయం ఎమింటంటే, ఇది నిజం అనుకునే అమాయకులు లేకపోలేదు.అలాంటి వారికి చెప్పేదేంటంటే, ఎయిర్టెల్ కాని, బిఎస్ఎన్ఎల్ కాని, అలాంటి ఆఫర్ ని తీసుకురాలేదు.

ఇందులో బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.అది కూడా ఇప్పుడప్పుడే కాదు.

ఇక ఎయిర్ టెల్ జియో నుంచి గట్టి దెబ్బ తగిలినా, ఇంకా కిందకి దిగట్లేదు.కాబట్టి ఆ స్కాంని నమ్మి, హ్యాకర్ల ఉచ్చులో పడొద్దు.

WhatsApp hoax

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube