నయా మోసం: కరోనా వ్యాక్సిన్ అంటూ ఆఫర్లతో పుట్టుకొచ్చిన ఫేక్ వెబ్సైట్..!

దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టించింది.ఇప్పుడిపుడే ప్రజలు కరోనా బారి నుండి కోలుకొని బయటికి వస్తున్నారు.

 New Scam Fake Website Born With Offers Called Corona Vaccine , Covid 19, Carona-TeluguStop.com

ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ ను అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కరోనా రాకుండా ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే కేంద్రం మాత్రం ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ ను ప్రైవేటు మార్కెట్లోకి తీసుకురాబోవడం లేదని మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు.

అయితే కరోనా వ్యాక్సిన్ ను ప్రజలకు ప్రభుత్వమే నేరుగా అమ్మాలని చూస్తున్నట్లు తెలిపారు.

ఇక అందుకోసం ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ద్వారానే అమ్మకాలను చేయాలనుకుంటుంది.రూ.4000 నుంచి రూ.6000 కే కరోనా వ్యాక్సిన్ ను పొందవచ్చునన్నారు.విదేశాల్లో దీని ఖర్చు అంతకు పదింతలు ఉంటుంది.త్వరపడండి.‘ అంటూ ’mohfw.xyz‘ అనే వెబ్ సైట్ ప్రకటన ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అచ్చం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ ను పోలి ఉండేలా ఈ వెబ్ సైట్ ను నకిలీ కేటుగాళ్లు రూపొందించారు.

Telugu Carona Ups, Carona, Covid Vaccine, Covid-Latest News - Telugu

అంతేకాక ప్రజల్లో కరోనా పట్ల ఉన్న భయాన్ని, కొవిడ్ వ్యాక్సినేషన్ పట్ల ఉన్న నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలని కొందరు సైబర్ నేరగాళ్లు ప్లాన్ వేశారు.mohfw.xyz పేరుతో నకిలీ వెబ్ సైట్ ను అచ్చం ప్రభుత్వ వెబ్ సైట్ లా రూపొందించి కోట్లకు కోట్లు కొల్లగొట్టాలనుకున్నారు.కానీ వారి ప్లాన్ బెడిసికొట్టింది.సోషల్ మీడియాలో ఈ వెబ్ సైట్ ప్రకటనలు చూసిన కొందరు నెటిజన్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి దీన్ని తీసుకొచ్చారు.

ఇక ఈ విషయం కాస్తా కేంద్ర వైద్యశాఖ దృష్టికి వెళ్లింది.దీంతో అప్రమత్తమయిన కేంద్రం ఈ విషయమై కీలక ప్రకటన చేసింది.

’అచ్చం అధికారిక వెబ్ సైట్ ను పోలి ఉండేలా ఓ నకిలీ వెబ్ సైట్ ను సృష్టించి కరోనా వ్యాక్సిన్ ను అమ్ముతున్నారంటూ ప్రకటనలు ఇస్తున్నారు.ప్రజలు వీళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

వీటిని నమ్మకండి‘ అని ఓ ప్రకటన విడుదల చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube