అమెరికాలో కొత్త కొలువులు...భారీ ప్రణాళిక సిద్దం చేసిన బిడెన్ ప్రభుత్వం..!!

కరోన మహమ్మారి దెబ్బకు అమెరికా ఆర్ధికంగా తీవ్ర నష్టాన్ని చవిచూసింది.లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, మరెంతో మంది తమ వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి నెలకొంది.

 New Scales In America  Biden Government Has Prepared A Huge Plan , America, Bide-TeluguStop.com

దాంతో అమెరికా వ్యాప్తంగా నిరుద్యోగం తాండవం చేసింది.దాంతో ప్రభుత్వానికి నిరుద్యోగ బృతి ఇవ్వక తప్పని పరిస్థితి అయితే కరోనా సెకండ్ వేవ్ వచ్చే సమయానికి అమెరికాలో పరిస్థితులు కుదుటపడటంతో యధావిధిగా వ్యాపారాలు, అన్ని కార్యకలాపాలు జరుగుతున్నా గతంలో మాదిరిగా చిన్నా, పెద్ద ఉద్యోగాల కల్పనా మాత్రం ఎక్కడ జరగడంలేదు.దాంతో ప్రభుత్వానికి నిరుద్యోగ బృతి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.సరిగ్గా వారం రోజుల క్రితం అమెరికా కార్మిక శాఖకు దాదాపు 2 లక్షలకు పైగా నిరుద్యోగ బృతి దరఖాస్తులు వచ్చాయంటే ప్రస్తుతం అమెరికాలో ఎలాంటి పరిస్థితి నెలకొందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈ పరిస్థితులను గాడిలో పెట్టేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.ప్రస్తుతం అమెరికాలో థర్డ్ వేవ్ డెల్టా కేసులు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో మరో సారి లాక్ డౌన్ పరిస్థితులు వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలి, వైరస్ వచ్చి తగ్గినా తరువాత మౌలిక సదుపాయాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ప్రజలకు ఉద్యోగాల కల్పన ఎలా జరగాలి అనే విషయాలపై కసరత్తులు చేస్తోంది ప్రభుత్వం.

Telugu America, Biden, Democrats, Scalesamerica, Republicans, Wave Delta-Telugu

అమెరికాలో మౌలిక వసతుల ఏర్పాటుకు దాదాపు రూ.75 లక్షల కోట్ల రూపాయలని కేటాయించాలని భావించిన ప్రభుత్వం ఈ బడ్జట్ ను సెనేట్ లో ఆమోదించుకుంది.ఒక వేళ ప్రభుత్వం ఈ సదుపాయాలను గనుక ఏర్పాతుక్ చేయగలిగితే తప్పకుండా పెను మార్పులు సంభివిస్తాయని, దాదాపు 20 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ పరిణామాలు ఎంతో ఊరట నివ్వడమే కాకుండా ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అయితే ఈ బడ్జెట్ కు సెనేట్ లో తుది ఆమోదం లభించాలంటే రిపబ్లికన్, డెమొక్రాట్ల లు ఇరువురుకి 50-50 బలం ఉండగా డెమోక్రటిక్ పార్టీకి 60 మంది మద్దతు లభించాలి అంటే రిపబ్లికన్ నేతలు 10 మంది డెమోక్రటిక్ నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube