శ్రీవారి భక్తుల దర్శనానికి సరికొత్త నిబంధనలు ..!

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకుని వచ్చింది.కరోనా కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 New Rules For The Darshan Of Srivari Devotees ..! Ttd, Tirumala Tirupati Temple,-TeluguStop.com

ఇప్పటికీ కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే సోషల్ డిస్టెన్స్ పాటించడం కోసం ఎక్కువ మంది భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వడం లేదు.

కేవలం రోజుకు 10000 మందిని మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో ఇకమీదట శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకుని ఉండాలని రూల్ పెట్టారు.

తప్పనిసరిగా దర్శనంకు వచ్చేవారు వాక్సిన్ రెండు డోసులు వేసుకున్న సర్టిఫికెట్ ను చూపించాలని నిబంధనను అమలు చేస్తున్నారు.

అలాగే దర్శనానికి వచ్చే భక్తులు మూడు రోజుల ముందు కరోనా టెస్ట్ చేపించుకుని,నెగిటివ్ రిపోర్ట్ వెంట తెచ్చుకోవాలనే నిబంధన కూడా పెట్టారు.

టీటీడీ దేవస్థానం వారు.కొవిడ్ ను నియంత్రిచాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని టీటీడీ అధికారులు అంటున్నారు.

పై నిబంధనలను యధావిధిగా భక్తులు పాటించాలని అధికారులు భక్తులను కోరుతున్నారు.ఇది ఇలా ఉండగా నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ ఈరోజు 9గంటలకు మూడు వందల రూపాయలకు సంబంధించిన 12వేల టికెట్లను విడుదల చేయనున్నారు.

Telugu Darshan, Devotees, Latest-Latest News - Telugu

అలాగే రేపు ఉదయం నుంచి 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనున్నారు.అయితే శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను టీటీడీ వెబ్‌సైట్‌లో మాత్రమే బుక్‌ చేసుకోవాలని భక్తులకు సూచించింది.నవంబర్‌ నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఈనెల 23 న విడుదల చెయనున్నట్లు తెలుస్తుంది.

సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తున్న క్రమంలో శ్రీనివాసం కాంప్లెక్స్‌లో గల ఆఫ్‌లైన్‌ టికెట్‌ కౌంటర్‌ను మూసివేశారు.టికెట్స్ బుక్ చేసుకునే ప్రతి ఒక్కరు రెండు విషయాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి.

ఒకటి వాక్సిన్ సర్టిఫికెట్ మరొకటి కరోనా నెగటివ్ టెస్ట్ రిపోర్ట్.ఇవి రెండు ఉంటేనే శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతి ఇస్తారు.!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube