లోకల్ ఎలక్షన్స్‌కు న్యూ రూల్స్.. వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. !

కరోనా మళ్లీ లోకాన్ని తన మాయలో పడేస్తుంది.దీని దాడికి లేని కొత్త కొత్త రూల్స్ అమలు చేయవలసిన పరిస్దితులు తలెత్తుతున్నాయి.

 New Rules For Local Elections State Election Commission Revealed, Local Election-TeluguStop.com

ఇందులో భాగంగానే లోకల్ ఎలక్షన్స్‌కు న్యూ రూల్స్ అమలు చేయనున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు నో మాస్క్, నో ఎంట్రీ విధానాన్ని తప్పనిసరి చేసింది.

అదీగాక రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కొవిడ్ నిబంధనల అమలు విషయంలో అటు ఓటర్లకు, ఇటు ఎన్నికల సిబ్బందికి అర్థమయ్యేలా మార్గదర్శకాలను గురువారం జారీ చేశారు.

ఇకపోతే కరోనా నిబంధనల అమలు ఎలా ఉందో పరిశీలించడానికి ప్రతీ వార్డులో వైద్యారోగ్య శాఖ సిబ్బంది నోడల్ అధికారులుగా ఉండాలని, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలింగ్ సిబ్బందికి ఆరోగ్యసేతు మొబైల్ యాప్ తప్పనిసరి అని పేర్కొన్నారు.

ఓటు వేయడానికి వచ్చేవారికి సోషల్ డిస్టెన్స్ నిబంధన తప్పనిసరి అని, ఇందుకోసం ప్రతీ ఆరు అడుగుల దూరానికి ఒకరు చొప్పున మొత్తం పదిహేను మంది నిల్చునేలా సర్కిల్ గుర్తుల్ని మార్కు చేయాలని, ప్రతీ పోలింగ్ కేంద్రం ఎంట్రీ దగ్గర శానిటైజర్ ఉండాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.వీలైనంత వరకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా, కరోనా కట్టడికి చర్యలు తీసుకుని ఎన్నికలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube